Allu Arjun Wife Sneha Reddy: స్టార్ హీరో భార్య అంటే ఎలా ఉండాలి. ఆయన స్థాయికి తగ్గట్లు మైంటైన్ చేయాలి. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనకు తగ్గట్లే వైఫ్ స్నేహారెడ్డి గ్లామర్, కల్చర్ మైంటైన్ చేస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ స్నేహారెడ్డి సొంతం. ఆమె అందాన్ని ట్రెండీ డిజైనర్ వేర్స్ రెట్టింపు చేస్తాయి. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఫోటో షూట్స్ చేయడం స్నేహారెడ్డికి అలవాటు. అప్పుడప్పుడు ఆమె తన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సిల్వర్ కలర్ డిజైనర్ శారీలో స్నేహారెడ్డి మెరిశారు.
స్నేహారెడ్డి అందం స్టార్ హీరోయిన్స్ ని కూడా డామినేట్ చేసేలా ఉంది. స్టైలిష్ స్టార్ వైఫ్ గా స్టైలిష్ లుక్ లో ఆమె కట్టిపడేశారు. అల్లు అర్జున్ భారీగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం స్నేహారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి డిజైనర్ వేర్స్ లో హాజరయ్యారు. అప్పట్లో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
భార్యలంటే ఇంటికే పరిమితం కావాలి, వంటిల్లు, పిల్లలే ప్రపంచం అనే రోజులు పోయాయి. తల్లయ్యాక కూడా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో 8.6 మిలియన్స్ ఫాలో అవుతున్నారంటే నమ్ముతారా?. ఒక స్టార్ హీరోయిన్ కి ఉండే పాపులారిటీ అది. ఆ విధంగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.
కాగా 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అల్లు అర్జున్ తో వివాహానికి స్నేహారెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అమ్మాయిని అడిగినా నో చెప్పేశారట. స్నేహారెడ్డి పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నారట. అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులకు అల్లు అయాన్, అల్లు అర్హ అనే అబ్బాయి అమ్మాయి సంతానంగా ఉన్నారు.