Venu Swamy On Allu Arjun: సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాలజీ నమ్మొద్దు అని కొందరు వాదిస్తూ ఉంటారు. కానీ కొందరు ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటలు నిజం కావడంతో చాలా మంది తమ జాతకం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రాలజిస్ట్ వేణు ఎవరు అడక్కపోయినా సినీ సెలబ్రెటీల జాతకం ముందే చెబుతున్నారు. వారి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వారి జీవితంలో జరిగే విశేషాలను ముందు చెప్పడం.. అవి జరగడం.. చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో వేణు చెప్పేవి నిజమేనని అంటున్నారు. తాజాగా ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన జీవితంలో ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పడంతో మెగా ఫ్యాన్ష్ షాక్ అవుతున్నారు.
ఆస్ట్రాలజిస్ట్ వేణు గతంలో సమంత-నాగ చైతన్య ల గురించి చెప్పాడు. వారు పెళ్లి చేసుకునే సమయంలోనే త్వరలో వీరు విడిపోతారని, విడాకులు తీసుకుంటారని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే సమంత-నాగచైతన్యలు దూరమయ్యారు. దీంతో వేణు ఆస్ట్రాలజీ సరైనదే అని చాలా మంది నమ్ముతున్నారు. ఆ తరువాత వరుణ్ తేజ్ గురించి కూడా వేణు సంచల వ్యాఖ్యలు చేశారు. త్వరలో వీరి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయని అన్నారు.
తాజాగా వేణు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. మిగతా హీరోల కంటే బన్నీ స్టార్ రేంజ్ లో కొనసాగుతాడని అన్నారు. ఆయన జాతకం అద్భుతంగా ఉందని, తెలుగులో అసలైన పాన్ ఇండియా హీరో అంటే అల్లు అర్జున్ అని అన్నారు. బన్నీపై ఒక్క రూపాయి ఇన్వెస్ట్ మెంట్ పెడితే రూ.10 రిటర్న్ వస్తాయని అన్నారు. అల్లు అర్జున్ నటించే ప్రస్తుత సినిమా పుష్క-2 సంచలనాలు సృష్టిస్తుందని వేణు చెప్పారు. వేణు చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లు అర్జున్ నటించే పుష్ప-2 గురించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్, కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. కలకత్తా కాళీ అవతారంలో ఉన్న అల్లు అర్జున్ లుక్ పై ఇప్పటికే ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీపై ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. పుష్ప పార్ట్ వన్ స్టేట్ లెవల్లో తీయగా.. రెండో పార్ట్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్ సృష్టించడం ఖాయం అని అంటున్నారు.