
ఒకప్పుడు ఒకసారి స్టార్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకుంటే, ఇక ఆ డైరెక్టర్ కి ఆ స్టార్ డమ్ అలా ఉండిపోయేది. ప్లాప్స్ వచ్చినా ఆయనగారిని స్టార్ డైరెక్టర్ గానే ట్రీట్ చేసేవారు. కాలం మారింది, ప్లాప్ వస్తే.. స్టార్ డైరెక్టర్ అయినా, చోటా డైరెక్టర్ అయినా ఇప్పుడు ఒక్కటే. ప్లాప్ డైరెక్టర్ గానే చూస్తున్నారు. ప్రస్తుతం ఒక స్టార్ డైరెక్టర్ పరిస్థితి హిట్ కి తక్కువ, ప్లాప్ కి ఎక్కువలా అయిపోయింది. ఆయనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి. పాపం ఏకంగా మెగాస్టార్ తో భారీ సినిమా ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్నా.. సురేందర్ రెడ్డికీ ఆ సినిమా పెద్దగా కలిసిరాలేదు. ఏ స్టార్ హీరో ఆయనకు పిలిచి అవకాశం ఇచ్చిన దాఖలాలు కనిపించకపోవడం, ఆయన ప్రస్తుత స్థితికి కాస్త ఇబ్బందికరమే.
మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని ఇటివలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పటికే బన్నీ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తోన్నాడట. ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు
మరి సురేందర్ రెడ్డి – బన్నీ కలయిక పై క్లారటీ వచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన రూమర్స్ పుంఖానపుంఖాలుగా వస్తూనే ఉంటాయి. బన్నీ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.