Allu Arjun To Grace The Pre-Release Event Of Ghani: తెలుగు చిత్రసీమలో అల్లు ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. కొన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యామిలీ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడం బహుశా అల్లు ఫ్యామిలీకి మాత్రమే దక్కిన ఘనత. అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ బడా నిర్మాతగా నేడు తనకంటూ ఒక సామ్రాజ్యన్ని సృష్టించుకున్నారు. అలాగే, అల్లు అరవింద్ వారసులులో అల్లు అర్జున్ స్టార్ అయితే, అల్లు శీరీష్ హీరోగా రాణిస్తున్నాడు.

తాజాగా అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ సినిమాతో నిర్మాతగా చిత్ర సీమకి పరిచయం కాబోతున్నాడు. తన అన్నయ్య మొదటిసారి నిర్మాతగా చేస్తున్న సినిమా కావడంతో.. బన్నీ ఈ సినిమా రంగంలోకి దిగాడు. నేడు వైజాగ్ ఆర్‌కే బీచ్ వద్ద జరగబోయే గని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బన్నీ వస్తున్నాడు.
Also Read: Rashmika Mandanna: ‘రష్మిక మందన్న’కు గోల్డెన్ ఛాన్స్.. కన్ఫర్మ్ చేశారు
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈవెంట్ కి క్యూ కడుతున్నారు. పుష్ప ఘన విజయం తర్వాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న భారీ ఈవెంట్ ఇదే. అందుకే బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రం ఏప్రిల్ 8న విడుదలవుతుండగా, బన్నీ సపోర్ట్ ఈ సినిమాకు మంచి ఊపు తీసుకురానుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ఇది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ గని మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్.. డైరెక్టర్, హీరోని పొగడ్తలతో ముంచెత్తారట.

బన్నీ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన వరుణ్ నటన చాలా గొప్పగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగింది. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇప్పటికే విడుదలైన గని ట్రైలర్ కు చక్కని రెస్పాన్స్ వస్తోంది. మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
Also Read: Renu Desai: చిరు సినిమా రవితేజ దగ్గరకు.. కీలక పాత్రలో రేణు దేశాయ్