Nagavamshi : ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతున్న చిత్రాలలో ఒకటి ‘డాకు మహారాజ్’. వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ తో దూసుకుపోతున్న బాలయ్య కి ఈ సినిమా మరింత ఊపుని ఇచ్చింది. మొదటి వారం లోనే అతి తేలికగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్న ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ కి బొకే ని పంపించి శుభాకాంక్షలు తెలియచేసాడు. దీనిని నాగవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు పంచుకుంటూ ‘మా సినిమా సక్సెస్ అయ్యినందుకు పూల బొకే ని పంపి శుభాకాంక్షలు తెలియచేసినందుకు కృతఙ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చాడు.
త్వరలోనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 500 కోట్ల రూపాయిలు విలువ చేసే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి నిర్మాతగా నాగవంశీ నే వ్యవహరిస్తున్నాడు. వరుసగా సూపర్ హిట్స్ తో ఈమధ్య నాగవంశీ కుంభస్థలాని బద్దలు కొట్టడం కామం అయిపోయింది. గత ఏడాది టిల్లు స్క్వేర్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగవంశీ, ద్వితీయార్థంలో ఎన్టీఆర్ దేవర చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. ఈ సినిమాకి ఏ రేంజ్ లాభాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే ఏడాది లో దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఈ యంగ్ నిర్మాత పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది.
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే, ఇంత చిన్న వయస్సు లో స్టార్ నిర్మాతల జాబితాలోకి చేరడం అనేది చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘మ్యాడ్ 2 ‘ ఉంది. ఈ సినిమాకి కూడా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అదే విధంగా విజయ్ దేవరకొండా, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం తో పాటు, భవిష్యత్తులో తెరకెక్కబోయే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాకి కూడా ఇతనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇదే ఊపులో ఆయన ముందుకు దూసుకుపోతే అతి తక్కువ సమయంలోనే నిర్మాత దిల్ రాజు ని కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఆ రేంజ్ కి ఇతను చేరుకుంటాడా లేదా అనేది. ప్రస్తుతం ఆయన డాకు మహారాజ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నాడు.
Humbled and Grateful
Thank you Icon Star @alluarjun garu for this thoughtful gesture and kind words on the blockbuster success of #DaakuMaharaaj #BlockbusterDaakuMaharaaj pic.twitter.com/ckqvc1wwdc— Naga Vamsi (@vamsi84) January 17, 2025