Allu Arjun : ‘పుష్ప 2’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది గత ఏడాది అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ ని లేపిన ప్రశ్న. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో ముందుగా చేయబోతున్నాడు అని ప్రచారం జరిగింది. కానీ అట్లీ(Director Atlee) తో చేయబోతున్నాడని ఖరారు అయ్యింది. ఆయన పుట్టినరోజు నాడు గ్రాండ్ గా ఒక స్పెషల్ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రకటన తోనే ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ఆ వీడియో ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిలో కలిగిన సందేహం, అసలు ఇది మన తెలుగు సినిమానేనా అని. అంత అద్భుతంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది ఈ వీడియో. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇటీవలే తెలిసాయి. అవేంటో చూద్దాం.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
ఈ చిత్రం లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే విషయం గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నది మన అందరికీ తెలిసిందే. మొన్న విడుదల చేసిన వీడియో లో కూడా డైరెక్టర్ ఈ విషయం లో ఒక చిన్న క్లూ ఇచ్చాడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Jhanvi Kapoor) నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇందులో నటించబోతున్నారట. అందులో సమంత(Samantha Ruth Prabhu) ఇప్పటికే ఖరారు అయ్యినట్టు సమాచారం. ఇందులో ఆమె చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె చేయబోయేది లేడీ విలన్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. ఇక మూడవ హీరోయిన్ కోసం ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు. ఒకరు శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) కాగా, మరొకరు దిశా పటాని(Disha Patani). వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉందట. అదే విధంగా మెయిన్ విలన్ రోల్ కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదిస్తున్నారట మేకర్స్.
సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని జూన్ నెల లో మొదలు పెట్టి, ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇకపోతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 165 కోట్లు, అదే విధంగా డైరెక్టర్ అట్లీ 125 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సినిమా బడ్జెట్ దాదాపుగా 800 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. త్వరలోనే పూజా కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారట మేకర్స్. ఆరోజే సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి కూడా అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.
Also Read : అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో మరో హీరో తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్…