Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సుక్కు – బన్నీ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుంది. బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17న “పుష్ప ది రైజ్ ” పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అయితే హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్ద గత రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు.

కానీ ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడం తో గేట్లను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు గాయపడినట్టు తెలుస్తోంది. ఇక అభిమానులు గాయపడటం పై బన్నీ స్పందించారు. “ఇవాళ ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిని నా టీమ్ పర్యేవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. అభిమానుల ప్రేమ, ఆరాధనే నాకు పెద్ద ఆసక్తి. అభిమానులను అలుసుగా తీసుకోను” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూస్తానని హామీ ఇస్తున్నా మీ ప్రేమ అభిమానం నాకు అతిపెద్ద ఆస్తులు..అంటూ బన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో కూడా వైరల్ గా కూడా మారింది.
— Allu Arjun (@alluarjun) December 13, 2021