
అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు అనే వార్త బయటకు రాగానే, బన్నీ అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా బన్నీ ఆరోగ్య వివరాలు గురించి అడుగుతూ కామెంట్లు పెడుతూ… బన్నీ పై తమకు ఉన్న నిస్వార్ధ ప్రేమను వాళ్ళు చాటుకుంటూనే ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం బన్నీ ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. బన్నీ కోవిడ్ నుంచి వేగంగానే కోలుకుంటున్నాడు.
బన్నీకి ప్రస్తుతం కరోనాకి సంబంధించి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. నిన్న సాయంత్రం కరోనా తీవ్రత పై జనరల్ చెకప్ చేయించుకున్న బన్నీ, అంతా నార్మల్ గానే ఉందని చెప్పడంతో ప్రస్తుతం తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇక కరోనా నుండి కోలుకున్న తరువాత తన ప్లాస్మాను డొనేట్ చేయనున్నాడు బన్నీ. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి గత వారం కరోనా అని తేలినప్పటి నుండి బన్నీ అభిమానుల్లో ఉత్సాహం పోయింది.
ముఖ్యంగా ‘పుష్ప’ షూటింగ్ లో బన్నీకి కరోనా సోకడంతో.. ఇప్పుడు తిరిగి ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా అయోమయంగానే ఉంది. ప్రస్తుతానికి అయితే బన్నీతో పాటు ఈ సినిమా యూనిట్ లో చాలామంది కరోనా బాధితులుగానే ఉన్నారు. అందుకే ఉన్నట్టు ఉండి ‘పుష్ప’ షూటింగ్ ని నిరవధికంగా ఆపేయాల్సి వచ్చింది.
మరి పూర్తిగా కరోనా కేసులు తగ్గిన తర్వాతనైనా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తే.. దసరాకి ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, పుష్పను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. తన కొత్త సినిమాల పై తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు బన్నీ. ఐకానిక్ టీమ్ ఇప్పటికే బన్నీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉంది. మరి బన్నీ తన తదుపరి ఏ మూవీకి పచ్చ జెండా ఊపుతాడో చూడాలి.