Allu Arjun and Ram Charan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Amir Khan) గత కొంత కాలం గా వెండితెర పై కనిపించడం లేదు. బాలీవుడ్ లో ఒకప్పుడు తన రికార్డ్స్ ని తానే బద్దలు కొట్టేవాడు అమీర్ ఖాన్. కానీ దంగల్ తర్వాత అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్, ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’,’లాల్ సింగ్ చద్దా’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం ఇండియా లో పెద్దగా ఆడలేదు కానీ, చైనా లో మాత్రం సెన్సేషన్ సృష్టించింది. అయితే ‘దంగల్’ చిత్రం విడుదలై 8 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ ఆ సినిమా కలెక్షన్స్ ని ఎవ్వరూ అందుకోలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, అమీర్ ఖాన్ హిట్ కొడితే ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతం ఆయన ‘తారే జమీన్ పర్’ అనే చిత్రానికి సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రం చేస్తున్నాడు.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే అమీర్ ఖాన్ డ్రీం ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ని తెరకెక్కించాలి అనేదే అని మన అందరికీ తెలిసిందే. ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఇదే ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. రీసెంట్ గా ఆయన ముంబై లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని కలవడానికి గల కారణం కూడా అదేనట. ఆయన తీయబోతున్న మహాభారతం లో అర్జునుడి క్యారక్టర్ కోసం అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరిపాడట. అల్లు అర్జున్ వైపు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లో కృష్ణుడి క్యారక్టర్ ని అమీర్ ఖాన్ పోషించబోతున్నాడు. అదే విధంగా కర్ణుడి క్యారక్టర్ కోసం రామ్ చరణ్(Global Star Ram Charan) ని సంప్రదించే పనిలో ఉన్నాడట అమీర్ ఖాన్.
వచ్చే నెలలో ‘పెద్ది’ మూవీ షూటింగ్ కోసం రామ్ చరణ్ ముంబై కి వస్తాడని, అక్కడ అమీర్ ఖాన్ తో సుదీర్ఘ చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా భీముడి పాత్రలో సల్మాన్ ఖాన్, నకుల, సహదేవ్ పాత్రల్లో మన టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు, అభిమన్యుడి క్యారక్టర్ కోసం విజయ్ దేవరకొండ, భీష్ముడి క్యారక్టర్ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్, ఇలా భారీ ఆలోచనలలో ఉన్నాడు అమీర్ ఖాన్. అదే విధంగా దుర్యోధనుడి క్యారక్టర్ కోసం కూడా ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోనే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అజయ్ దేవగన్ ఈ క్యారక్టర్ ని చేయొచ్చు. ఇక కీలకమైన ద్రౌపది క్యారక్టర్ కోసం దీపికా పదుకొనే ని అడుగుతున్నారట. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.
Also Read : గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు టాప్ హీరోనో తేలబోతుందా..?