Allu Arjun Raka First Look: అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇండియా వైడ్ గా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు ఒక ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ‘రాకా’అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరిలో ఒక హై ఫీల్ ఇచ్చే విధంగా కనిపిస్తోంది. దానికి తోడుగా ఆయన కింగ్ కాంగ్ గెటప్ లో మనకు కనిపించబోతున్నాడు. మొత్తానికైతే ఫస్ట్ లుక్ ను చాలా బాగా డిజైన్ చేశారు…ఇక అల్లు అర్జున్ బట్టతలతో కనిపించబోతున్నాడు.
దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉందట. ఈ సినిమాలో తను అనుకున్న టైమ్ లో కింగ్ కాంగ్ గా మారిపోయి మళ్లీ ఇతర సమయాల్లో మామూలు మనిషిగా మారి సమాజంలో జీవిస్తుంటాడట. అతను కింగ్ కాంగ్ గా మారడానికి గల కారణం ఏంటి అసలు ఆ బట్టతల వెనుక ఉన్న రీజన్ ఏంటి అనేది కూడా వైరల్ అవుతుంది. నిజానికి ఆయన లుక్ అలా ఉంటుందట.
కింగ్ కాంగ్ ఎపిసోడ్ లో ఆయనకు సగం హెయిర్ మాత్రమే ఉంటుంది. గుండు మీద హెయిర్ లేకపోవడానికి గల కారణాన్ని కూడా ఈ సినిమాలో చాలా క్లారిటీగా చూపించబోతున్నారట… దానిమీద కొన్ని సీన్స్ ని కూడా డిజైన్ చేశారట. మొత్తానికైతే ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్కు మీద కూడా చాలావరకు రీసెర్చ్ చేసి దానికోసం సపరేట్ బ్యాక్ స్టోరీలను సెట్ చేసి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే రాకా అనే ట్యూటిల్ సైతం చాలా ఎఫెక్టివ్ గా ఉండటమే కాకుండా ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే చెప్పాలి… ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా చాటడమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని సైతం పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయిన కూడా వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…