Site icon OkTelugu

Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ మూవీలో రాక్షసుడిగా నటిస్తున్న స్టార్ హీరో…

Allu Arjun Raaka Movie

Allu Arjun Raaka Movie

Allu Arjun Raaka Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళుతున్నాడు. అట్లీ అల్లు అర్జున్ ఇద్దరు వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాక సినిమాలో రాక్షసుడి పాత్రలో ఒక బాలీవుడ్ నటుడు నటిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఎవరు అనే విషయాన్ని సినిమా యూనిట్ గోప్యంగా ఉంచినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రాక్షసుడి క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే రీసెంట్ గా అట్లీ అతనితో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే 50 పర్సెంట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందరలోనే బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఏది ఏమైనా అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాత ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక రాకా సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళిపోతుందని భావిస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు కాబట్టి ఇలాంటి సబ్జెక్టుని డీల్ చేస్తున్నందుకు కూడా అతనికి మంచి పేరైతే వస్తుంది…

ఇక ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటూనే టెక్నికల్ గా హై విజువల్స్ ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఇంతకుముందు అట్లీ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా కమర్షియల్ గా సూపర్ సెక్షన్స్ అవుతుందని అట్లీ భావిస్తున్నాడు… అల్లు అర్జున్ సైతం అట్లీ విజన్ ను నమ్మి ముందుకు సాగుతున్నాడు…

Exit mobile version