Site icon OkTelugu

Allu Arjun Raaka Movie Set Cost: ‘రాకా’ మూవీ కోసం కొత్త సెట్ రెడీ…ఈ షెడ్యూల్ కి అయ్యే ఖర్చు తో ఒక ఊరునే కొనేయచ్చు…

Allu Arjun Raaka Movie

Allu Arjun Raaka Movie

Allu Arjun Raaka Movie Set Cost: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కనీవినీ ఎరుగని రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఇండియా ఇండస్ట్రీ కే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.

ఇక ఏదేమైనా కూడా అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తీయడానికి 300 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారట. ఇక 300 కోట్లతో సెట్ వేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఈ డబ్బులతో ఒక ఊరు మొత్తాన్ని కొనవచ్చు అంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు…

దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటి ని రేకెత్తిస్తుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు… ఆ ఒక్క పోస్టర్ తో సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోయింది…ఇక అల్లు అర్జున్ క్రేజ్ మాములుగా లేదంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ తో సత్తా చాటితే ఆయన టాప్ లెవెల్ లోకి వెళ్తాడు అని అతని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమా భారీ హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారతాడని మరి కొంతమంది చెబుతుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశం ఉంది.

Exit mobile version