Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Favorite NTR: అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ అంటే...

Allu Arjun Favorite NTR: అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం… దానికి కారణం ఇదే…

Allu Arjun Favorite NTR: సినిమా ఇండస్ట్రీలో హీరో గా సక్సెస్ లను సాధించడం అంత ఆశామాషీ వ్యవహారమైతే కాదు. ఒక సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం ప్రేక్షకుడికి నచ్చాలి. అలా చేసినప్పుడే సినిమాకి సక్సెస్ వరిస్తుంది. కొన్ని కథలు చెప్పడానికి బాగున్నప్పటికి స్క్రీన్ మీద వర్కౌట్ కాకపోవచ్చు. ఇక అలాంటి వాటిని కూడా జడ్జ్ చేయగలిగే కెపాసిటి ఉండాలి… తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో చాలామంది హీరోలు తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో స్టార్ హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక అల్లు అర్జున్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటుండటం విశేషం… కెరియర్ మొదట్లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆ తర్వాత మాత్రం అల్లు ఫ్యామిలీ పేరుతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు… వాస్తవానికి రామ్ చరణ్ అల్లు అర్జున్ కి బావ అవుతాడు. వాళ్ళ మేనత్త కొడుకు కావడం వల్ల చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళ మధ్య సినిమాలపరంగా గాని అభిమానుల పరంగా గాని పోటీ ఉండటం వల్ల అల్లు అర్జున్ కి రామ్ చరణ్ అంటే పడడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తనకు చాలా బాగా దగ్గర ఫ్రెండ్ గా మారిపోయాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ‘బావ హ్యాపీ బర్త్ డే నీకు ఈ సంవత్సరం సూపర్ సక్సెసులు’ రావాలని కోరుకుంటున్న అంటూ ఒక ట్వీట్ చేశాడు… దానికి అల్లు అర్జున్ సైతం రెస్పాండ్ అయ్యాడు.

ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి విల్లా మధ్య సన్నిహిత సంబంధం అయితే ఉందని చాలా మంచి ఫ్రెండ్స్ గా కూడా కొనసాగుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి రామ్ చరణ్ కంటే కూడా అర్జున్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటేనే చాలా ఇష్టమని చాలామంది చెబుతుంటారు.

ఇక ఏది ఏమైనా కూడా సినిమాల పరంగా పోటీ ఉంటే పర్లేదు. కానీ సినిమాలను పర్సనల్ లైఫ్ గా తీసుకొని వారిని శత్రువులుగా భావిస్తే మాత్రం వాళ్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version