
అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే గిఫ్ట్ గా ఈ ఉదయం 9 గంటలకు తమ సినిమా విశేషాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చినట్టు చిత్ర బృందం వెల్లడించింది.ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందా లేదా అన్నమీమాంస కు తెరపడింది .
తన సినిమాకు సంబంధించి ప్రతిదీ కొత్తగా ఉండాలని ఆలోచించే సుకుమార్.. బన్నీతో చేయబోయే ఈ హ్యాట్రిక్ సినిమాకు ‘పుష్ప’ అనే వెరైటీ టైటిల్ పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది అనుకోవాలి. ఈ సినిమా లో హీరో పాత్ర పేరు పుష్ప నారాయణ్ అట దాంతో అందరూ హీరోని `పుష్ప` అని పిలుస్తారట. అందుకే ఆ పేరునే సినిమాకు పెట్టాలని సుకుమార్ టీం ఫిక్స్ అయ్యింది.
Allu Arjun’s Pushpa First Look Posters
ఇక అల్లు అర్జున్ , సుకుమార్ కాంబో లో వసున్న ఈ ` పుష్ప` సినిమా చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కదాంశం గా రాబోతుంది. నిజానికి ఈ టైటిల్ పెట్టడం వెనుక ఓ విశేషం ఉంది. చిత్తూరు జిల్లాలో పుష్ప అనే పేరు బాగా పాపులర్. ఈ ప్రాంతంలో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ ఈ పేరు పెట్టుకుంటారు. పుష్పావతి, పుష్పలత, పుష్పరాజ్, పుష్పకుమార్ లాంటి పేర్లు ఈ ఏరియా లో చాలామందికి ఉంటాయి. ఈ తరంలో కాదు కానీ.. మూడు ,నాలుగు దశాబ్దాల క్రితం పుష్ప పేరు బాగా పాపులర్. ” పుష్ప ” సినిమా 1980 కాలం నాటిది కనుక అప్పటి వాతావరణానికి తగ్గట్టు హీరోకు ఆ పేరు పెట్టి , దాన్నే సినిమా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది.