Allu Arjun Daughter Arha: అల్లు అర్జున్ తన గారాల పట్టి అర్హతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఆమె అల్లరి అల్లు అర్జున్ తెగ ఎంజాయ్ చేస్తారు. అర్హతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేయడం సరదాగా ఫీల్ అవుతారు. తండ్రికి తగ్గట్లే అర్హకి ఎనర్జీ చాలా ఎక్కువ. అప్పుడే ఈ చిచ్చర పిడుగు వాళ్ళ నాన్నను ఓ ఆటాడుకుంటుంది. ఈ తండ్రి కూతుళ్లు చేసిన సరదా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అర్హ వాళ్ళ నాన్నకు కొన్ని పరీక్షలు పెట్టింది. మొదటగా… గంగిగోవు పాలు గరిటడైనను చాలు? అని అడిగింది. అది పొడుపు కథ అని భావించిన అల్లు అర్జున్.. జున్ను అని ఆన్సర్ చెప్పాడు.

నీకెలా తెలుసు అని అర్హ అడిగింది. నాకు తెలుసురా బే అని బన్నీ అన్నారు. నెక్స్ట్ ఓ క్రిటికల్ పరీక్ష పెట్టింది. ‘ఐదు నల్ల లారీలు ఐదు తెల్ల లారీలు’ అనే వాఖ్యాన్ని తప్పు పోకుండా గబగబా చెప్పాలంది. ఈ పరీక్షలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఆ పదాలను త్వర త్వరగా పలకలేకపోయారు. కూతురు పెట్టిన పరీక్షలో ఓడిన అల్లు అర్జున్ భలే ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Raasi: హీరోయిన్ రాశి కి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మరోవైపు అర్హ తెరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో ఆమె బాలనటిగా ఎంట్రీ ఇస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. చిన్నారి అర్హ వెండితెరపై ఎలాంటి సంచలనాలు చేయనుందోనని అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శాకుంతలం వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇక అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నారు. అధికారికంగా ఇటీవల పుష్ప 2 పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో భారీగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు క్యాస్ట్ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్.. పోటీ ఎక్కడి నుంచంటే?
[…] […]