Allu Arjun And Lokesh Kanagaraj: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో అల్లు అర్జున్…ఆ సినిమా ఇచ్చిన హై తో ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నాడు. ఇక ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ ని పెడుతున్నప్పటికి ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి అట్లీ సైతం తన శాయశక్తుల కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తుండటం విశేషం…
ఇక 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం… ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిటైన విషయం మనకు తెలిసిందే.
రీసెంట్ గా లోకేష్ సినిమాకు సంబంధించిన పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకొని అల్లు అర్జున్ కి వినిపించారట. స్క్రిప్ట్ మొత్తం అతడికి బీభత్సంగా నచ్చడంతో స్క్రిప్ట్ ని లాక్ చేశారు. ఇక ఈ సినిమా జానార్ ఏంటి అనే విషయంలోనే ఇంక సరైన క్లారిటీ రావడం లేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని కొంతమంది చెబుతుంటే సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు అంటు మరి కొంతమంది చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది చాలా కీలకం. కాబట్టి లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాతో భారీగా దెబ్బైపోయి ఉన్నాడు. ఒక రకంగా అల్లు అర్జున్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. మరి తనను తాను ప్రూవ్ చేసుకొని అల్లు అర్జున్ కి భారీ విజయాన్ని కట్టబెడతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…