Allu Arjun: ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా దర్శకత్వంపై మక్కువ చూపుతున్నారు అందులోని భాగంగా నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన”వరుడు కావలెను” ఈ సినిమాకి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ‘వరుడు కావలెను’ ముందస్తు విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు.
శుక్రవారం ఈ మూవీ విడుదల కానుంది దీనిని ఉద్దేశించి అల్లు అర్జున్ లక్ష్మీసౌజన్య దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముంబయిలో సినిమా సెట్లో యాభై శాతం అమ్మాయిలు కనిపిస్తుంటారు. మన దగ్గర ఆ రోజుల వచ్చాయని అనుకుంటున్నా అని అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రం లో నాగశౌర్య తన నటనతో మెప్పించారు. స్వతంత్రంగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. రీతూవర్మ అద్భుతంగా నటించారని… ఈ సినిమాలు విజయవంతంగా ఆడాలి అని కోరుకున్నారు. త్వరలోనే ‘పుష్ప’చిత్రం విడుదల కానుందని… ఈ చిత్రం ప్రేక్షకులకు అలరిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ… మన ఇళ్లల్లో జరిగే, మనకి తెలిసిన ఆడపిల్లల తాలూకు కథ మన మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. నాగశౌర్య చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్న ఓ హీరోయిన్‌ని చూశా’’అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ దర్శకురాలు సౌజన్య 15 ఏళ్లు కష్టపడింది. ఈ చిత్రంతో తప్పక విజయం అందుకుంటుందని… అల్లు అర్జున్ సర్, త్రివిక్రమ్ సర్ ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ‘రొమాంటిక్’ సినిమా కూడా విడుదల కానుందని అందుకు ఆకాష్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ వేడుకల్లో నదియా, తమన్, విశాల్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.