
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్ ‘ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ని నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.టీజర్ కంటే కూడా, అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో చీర కట్టి, చేతిలో గన్ పెట్టి, అతి భీకరమైన గెటప్ తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.
ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక స్టార్ హీరో ఇలాంటి డేరింగ్ గెటప్ వెయ్యడం ఎప్పుడూ చూడలేదు.అల్లు అర్జున్ ఆ సాహసం చేసాడు.గంగోత్రి సినిమాలో లేడీ గెటప్ వేసినందుకు ఇప్పటికీ అల్లు అర్జున్ ని వెక్కిరించే వాళ్ళు ఉన్నారు.అలాంటి వారిచేతనే అదే లేడీ గెటప్ వేసి శబాష్ అనిపించేలా చేసాడు.

సుకుమార్ తన ప్రతీ సినిమాలోనూ డిటైలింగ్ ఇవ్వడం లో సిద్ద హస్తుడు, అవి కనిపెట్టినప్పుడు ఏమి తెలివి రా బాబు అని మనకి అనిపిస్తూ ఉంటుంది.ఈరోజు వదిలిన పుష్ప కంటెంట్ లో కూడా సుకుమార్ బోలెడంత డిటైలింగ్ ఇచ్చాడు.ఇందులో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు.ఆ తర్వాత ఆయన హిజ్రా వేషం లో వచ్చి విలన్స్ ని చంపుతూ ఉంటాడు అనేది చెప్పకనే చెప్పేసాడు.గమనిస్తే టీజర్ చివర్లో అల్లు అర్జున్ పులి పక్కన నడుచుకొని వెళ్తూ దాని వైపు చూస్తూ ‘తగ్గేదే లే’ అనే మ్యానరిజం ఇస్తాడు.
ఆయన మ్యానరిజం ఇచ్చేటప్పుడు అల్లు అర్జున్ చిటికిన వేలు మీద గోరు పై నైల్ పాలిష్ ఉంటుంది.దానిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అల్లు అర్జున్ సినిమా మొత్తం అజ్ఞాతం లో ఉంటూ ఇదే వేషం వేసుకొని విలన్స్ ని చంపుతుంటాడు అని.ఈ డీటెయిల్ ని గమనించిన నెటిజెన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది, టీజర్ లోనే ఇన్ని ట్విస్టులు ఇస్తే ఇక సినిమాలో ఎన్ని ఇస్తాడో చూడాలి.