Allu Arjun-Trivikram: ఒకప్పుడు త్రివిక్రమ్ రైటర్ గా చేసిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా మీద జనాల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఇక ఆ తర్వాత ఆయన డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా ఆయన డైరెక్షన్ లో సినిమాలు వస్తున్నాయంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో అమితమైన అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ సినిమా అంటే మిగతా డైరెక్టర్లు మాదిరి గానే ఒక రొటీన్ కమర్షియల్ సినిమాల మాదిరిగా తయారయ్యాయి.
ఇక రీసెంట్ గా ఆయన మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా పట్టలెక్కుతుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు తను చెప్పిన స్టోరీ కూడా ఒక రొటీన్ రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉందని దానివల్ల అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలా వద్దా అనే ఒక చిన్న డైలమా లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇప్పటికైనా త్రివిక్రమ్ తన ఫార్మాట్ ని మార్చుకొని ఒక కొత్త స్టోరీ ని ఎంచుకొని కొత్త ఫార్మాట్ లో సినిమాలు చేస్తే తప్ప మళ్ళీ త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అందరూ డైరెక్టర్ లు వైవిధ్యమైన స్టోరీ లను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఒకరిని మించిన ఆలోచనలతో మరొకరు తమ సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకుంటుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఆ రొటీన్ ఫార్ములానే నమ్ముకుంటూ వస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి ఒక కండిషన్ పెట్టినట్టు గా తెలుస్తుంది.
అది ఏంటి అంటే ఒక మంచి డిఫరెంట్ స్టోరీ ని తీసుకొని వస్తే సినిమా చేద్దామని చెప్పినట్టు గా వార్తలైతే వస్తున్నాయి… ఇక త్రివిక్రమ్ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ ని రెఢీ చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది…చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా, ఒక వేళ వీళ్ళ కాంబో లో సినిమా వచ్చిన కూడా అది ఎలాంటి జానర్ లో వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…