Allu Arjun rejection story: సౌత్ నుండి నార్త్ వరకు , బడా నిర్మాతలు అందరూ ఇప్పుడు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కాల్ షీట్స్ ని సంపాదించడం కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. మరో పక్క నేటి తరం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ కి కూడా అల్లు అర్జున్ కాల్ షీట్స్ కావాలి. ప్రస్తుతానికి లోకేష్ కనకరాజ్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్స్ కలిసి పని చేస్తున్న ఆయన, భవిష్యత్తులో సందీప్ వంగ, రాజమౌళి , సంజయ్ లీల భన్సాలీ వంటి టాప్ డైరెక్టర్స్ తో పని చేయబోతున్నాడు. ఎటు చూసుకున్నా అల్లు అర్జున్ కెరీర్ మరో 15 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. ఇలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి కూడా కెరీర్ ప్రారంభం లో కష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది అంటే నమ్ముతారా?.
అల్లు అర్జున్ కి కెరీర్ ప్రారంభం లో కష్టాలు రావడం ఏంటి?, ఆయన తండ్రి టాలీవుడ్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్, పెద్ద మామయ్య చిరంజీవి , చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ కి కష్టాలు ఎదురయ్యాయా?, ఇదెక్కడి విచిత్రం అండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. కానీ స్వయంగా అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రం తర్వాత తానూ ఎదురుకున్న పరిస్థితుల గురించి ‘ఆర్య’ మూవీ 20 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అప్పుడే గంగోత్రి సినిమా విడుదలైంది. పెద్ద కూడా అయ్యింది కానీ, ఈ అబ్బాయి చూసేందుకు అసలు బాగాలేడు , ఇతనితో సినిమా అంటే రిస్క్ అని చాలా మంది నిర్మాతలు భయపడే వారు’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాను. ప్రతీ రోజు మూడు కథలు వింటూ ఉండేవాడిని కానీ , ఏది ఒక పట్టాన నచ్చేది కాదు , ఎక్కడో ఎదో మ్యాజిక్ మిస్ అవుతుంది అని అనుకునేవాడిని. అలాంటి సమయం లో దిల్ చిత్రం విడుదలైంది. ఒక రోజు దిల్ రాజు గారు ప్రసాద్ ల్యాబ్స్ లో షో వేసాడు. హీరో తరుణ్ నాకు మంచి స్నేహితుడు, ఆయన నాకు ఫోన్ చేసి ఇలా రాజు గారు ప్రసాద్ ల్యాబ్స్ లో దిల్ సినిమా వేస్తున్నాడు. నేను వెళ్తున్నాను , నువ్వు కూడా వస్తావా అని పిలిస్తే , తరుణ్ తో పాటు వెళ్ళాను. అక్కడే సుకుమార్ గారు నన్ను చూసారు. నా వద్దకు వచ్చి ఆర్య కథ వినిపించాడు. నేను ఇంత కాలం ఎదురు చూసిన సరైన స్క్రిప్ట్ దొరికేసింది , ఈ స్క్రిప్ట్ లో మ్యాజిక్ ఉందని బలంగా నమ్మాను. ఆ తర్వాత ఈ చిత్రం సృష్టించిన వండర్స్ మీ అందరికీ తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే అందంగా లేడని అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి ముఖ చాటేసిన నిర్మాతలు , డైరెక్టర్లు మరెవరో కాదు, చిరంజీవి , బాలయ్య తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అట. డైరెక్టర్ కూడా నేడు ఇండస్ట్రీ లో పెద్ద స్థాయిలోనే ఉన్నాడట.