Allu Arjun Dream Role: అల్లు అర్జున్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ పాత్రనైతే ఉంటుంది. ఇక అలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. కారణమేంటి అంటే ఆయన చేసే సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లో తన స్టార్ డమ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.
యావత్ ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి అల్లు అర్జున్ కి ఉందని మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ తన ఎంటైర్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన ఏ పాత్ర కూడా తనకి 100% సంతృప్తిని ఇవ్వలేదట. కానీ ఫ్యూచర్లో మాత్రం తన డ్రీమ్ రోల్ ని ఫుల్ ఫీల్ చేసుకుంటానని ఆయన క్లారిటీగా చెబుతున్నాడు.
ఇంతకీ అతని డ్రీమ్ రోల్ ఏంటంటే ఒక రైతుగా అతను కనిపించాలని, వాళ్ళు ఎదుర్కునే బాధలను చెప్పాలని ప్రతి ఒక్కరికి వాళ్లు పడే బాధలు ఇబ్బందులను తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన అనుకుంటున్నాడట. ఇక వీలైనంత తొందరగా ఎవరైనా అలాంటి స్క్రిప్ట్ తో వస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా చెబుతున్నాడు.
అలాగే అది పాన్ వరల్డ్ లో వచ్చే విధంగా ఉండాలని అలాంటి కథ కోసం ఆయన వెతుకుతున్నారట. ఇక ఇదంతా తెలిసిన తర్వాత చాలామంది రచయితలు, దర్శకులు అతనికి అలాంటి కథనైతే రాసుకునే అవకాశాలైతే లేకపోలేదు. చూడాలి మరి అల్లు అర్జున్ తన కెరియర్ లో తన డ్రీమ్ రోల్ ను చేస్తాడా? లేదా అనేది…