Tamil directors Telugu heroes sentiment: మన టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. అందులో అందరూ నమ్మే బలమైన సెంటిమెంట్ ఏంటంటే , తమిళ డైరెక్టర్ తో తెలుగు స్టార్ హీరో సినిమా చేస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే తమిళ డైరెక్టర్ తో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. తమిళ డైరెక్టర్ ఎస్ జె సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఆయన చేసిన తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించిన కరుణాకరణ్ కూడా తమిళ డైరెక్టరే. కానీ ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ తమిళ డైరెక్టర్స్ పని చేసినవన్నీ భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. ముఖ్యంగా తమిళ డైరెక్టర్స్ కారణంగా కెరీర్ ని డేంజర్ జోన్ లోకి పడేలా చేసుకున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.
ఆయన ఎస్ జె సూర్య తో చేసిన ‘నాని’, మురుగదాస్ తో చేసిన ‘స్పైడర్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. అదే విధంగా తమిళం లో రాజమౌళి లాంటి ఇమేజ్ ఉన్న డైరెక్టర్ శంకర్ , రామ్ చరణ్ తో తీసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. మీడియం రేంజ్ హీరో గా పిలవబడే రామ్ పోతినేని కూడా తమిళ డైరెక్టర్ లింగు స్వామి తో కలిసి చేసిన ‘వారియర్’ చిత్రం కూడా దారుణమైన పరాజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి సెంటిమెంట్స్ బలంగా నడుస్తున్న సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్స్ తో కమిట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
అట్లీ తో చేస్తున్న సినిమాకు ‘రాకా’ అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. దీనికి నెటిజెన్స్ నుండి దారుణమైన నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘రాకా’ అనే టైటిల్ అసలు సూట్ అవ్వలేదని , అల్లు అర్జున్ లుక్ కూడా పాత సినిమాల నుండి కాపీ కొట్టినట్టుగానే ఉందని , 600 కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాకు ఇలాంటి టైటిల్స్ పెట్టడం ఏంటో అసలు అర్థం కావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్స్ తో తెలుగు హీరోలు చేసే సినిమాలు అట్టర్ ఫ్లాప్ అని అంటుంటారు. బహుశా ఈ సినిమాకు కూడా అలాంటి పరిస్థితి పట్టొచ్చు అని అంటున్నారు. కానీ డైరెక్షన్ లో తేడా కొట్టినా, అల్లు అర్జున్ తన నటనతో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తాడని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.