యాహూ సెర్చ్ ఇంజిన్ సంస్థ ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ ని ప్రకటిస్తుంది . అలానే ఈ సంవత్సరం 2020కి గానూ ఆ లిస్ట్ ని మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాలో మన తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్లేస్ దక్కించుకోవటం విశేషం. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ నెలలో చనిపోవటం జరిగింది . అయితే అనూహ్యంగా సుశాంత్ సింగ్ 2020 లో ‘మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ’గా మొదటి ప్లేస్ లో ఉన్నారు. ఈ న్యూస్ మరొకసారి అతని అభిమానులని విషాదంలోకి తీసికెళ్ళింది. సుశాంత్ సింగ్ ప్రియురాలు , బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి అత్యధికంగా సెర్చ్ చేసిన మహిళా సెలబ్రిటీగా ఎంపికవటం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా ఈ జాబితాలో ఎక్కువమంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురం” మూవీ సూపర్ హిట్ గా నిలవటం మరియు ఆ మూవీ లో ని ‘బుట్టబొమ్మ ‘ సాంగ్ ఇండియాలో విరాళ అవ్వటం వలన అల్లు అర్జున ఈ ఘనత సాధించినట్లుగా చెప్తున్నారు.
Also Read: ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ కే 22 కోట్లు !
ఇక ఈ జాబితా చుస్తే మేల్ సెలబ్రిటీ విభాగంలో సుశాంత్ మొదటి ప్లేస్ లో ఉండగా , అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్, క్యాన్సర్‌తో చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్, సోను సూద్,అనురాగ్ కశ్యప్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది ‘మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ’ జాబితాలో రియా మొదటి స్థానంలో ఉండగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రెండవ స్థానంలో నిలిచింది. కంగనా రనౌత్ ఈ సంవత్సరంలో సుశాంత్ విషయంలోనూ, మహారాష్ట్ర ప్రభుత్వం తో జరిగిన గొడవలోనూ హైలైట్ అయ్యింది. దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక 2020 ‘టాప్ న్యూస్‌మేకర్స్’ కేటగిరీ విషయానికి వస్తే, ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు, సుశాంత్ , రియా సంయుక్తంగా రెండవ స్థానంలో, రాహుల్ గాంధీ మూడవ స్థానంలో ఉన్నారు. తరువాత కేటగిరి విభాగం ‘సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్స్’ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, శిల్ప శెట్టి, రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు మరియు దేశంలో అనేక మందికి సహాయం చేసిన నటుడు సోనూ సూద్ ను ‘హీరో ఆఫ్ ది ఇయర్’ గా గుర్తించింది. ఆయన చేసిన సేవలకు గౌరవం దక్కినట్లుగా ఆయన అభిమానులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై భక్తుడు ఎమోషనల్ ట్వీట్స్ !
మొదటి 10 మగవారి జాబితా :
1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్
2. అమితాబ్ బచ్చన్
3. అక్షయ్ కుమార్
4. సల్మాన్ ఖాన్
5. ఇర్ఫాన్ ఖాన్
6. రిషి కపూర్
7. ఎస్సీ బాలసుబ్రమణ్యం
8. సోను సూద్
9. అనురాగ్ కశ్యప్
10. అల్లు అర్జున్
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Allu arjun among yahoos most searched person of 2020
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com