Allu Arjun-Ajith : స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number One) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి ఆ సినిమా అందించిన సక్సెస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధిస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) లాంటి సినిమాలతో పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్, అజిత్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఈ విషయాన్ని రాజమౌళి వాళ్ళ ఫాదర్, ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ గారు ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…మరి ఇప్పటివరకు రాజమౌళి అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.
Also Read : అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ కంటే ఆ దర్శకుడే ఎక్కువా? గురూజీని పక్కన పెట్టడమేంటీ?
మరి ఫ్యూచర్లో అయిన తనతో సినిమాలు చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ప్రపంచ సినిమా స్థాయిని శాసించే స్థాయికి రాజమౌళి ఎదుగుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎక్కడో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కి వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తనను తాను జనరేషన్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టే రాజమౌళి అవుట్ డేటెడ్ అవ్వకుండా అప్డేట్ లో ఉంటూ మంచి దర్శకుడి గా ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక భారీ ఎలిమెంట్ అయితే ఉంటుంది. అందుకే ఆయన సినిమాలను ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు.
ఎమోషన్ ని ఎలివేషన్ ని బ్యాలెన్స్ చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంత మరెవరికి తెలియదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాశించిన రాజమౌళి ప్రపంచ సినిమా స్థాయిని అందుకుంటాడా? అక్కడ ఎదురయ్యే పోటీని తట్టుకొని నిలబడగలుగుతాడా? తద్వారా మన తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…