Charmy Kaur: వరుస రూమర్స్ నేపథ్యంలో నిర్మాత ఛార్మి మాట తప్పారు. ఆ అపవాదులు భరించలేక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఛార్మి తప్పిన ఆ మాటేమిటి అంటే… లైగర్ డిజాస్టర్ దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మిని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాదాపు 50 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. లైగర్ తో పూరి-ఛార్మి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు లైగర్ నష్టాలతో సతమతం అవుతుంటే… జనగణమన ఆగిపోయింది.

జనగణమన మూవీతో కమ్ బ్యాక్ కావాలని పూరి ఆశించారు. లైగర్ నష్టాలు డిస్ట్రిబ్యూటర్స్ కి జనగణమనతో భర్తీ చేస్తానని పూరి జగన్నాధ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ప్రాజెక్ట్ ఆగిపోవడంతో వాళ్ళ నుండి ఒత్తిడి పెరిగే సూచనలు కలవు. జనగణమనకు నిర్మాతలుగా ఉన్న మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయారు. ఇప్పటికే రూ. 20 కోట్లు ఈ సంస్థ ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఈ వార్తలను పూరి ఖండించకపోవడంతో నిజమేనని అందరూ నమ్ముతున్నారు.
అలాగే పూరి అద్దె చెల్లించలేక ముంబై అపార్ట్మెంట్ ఖాళీ చేశారని, ఇస్మార్ట్ శంకర్ 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని, కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నాడు… అంటూ అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వరుస రూమర్స్ నేపథ్యంలో ఛార్మి ఓపెన్ అయ్యారు. ఈ పుకార్లు అన్నింటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఛార్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అన్నీ పుకార్లే… ఈ పుకార్లన్నీ ఫేక్. పూరి కనెక్ట్స్ బ్యానర్ డెవలప్మెంట్ పై వర్క్ చేస్తున్నాము. రిప్ రూమర్స్ అంటూ… ట్వీట్ చేసింది. అయితే అనుకోకుండా ఇక్కడ ఛార్మి మాట తప్పింది. ఇటీవల ఛార్మి సోషల్ మీడియాకు స్వల్ప విరామం ప్రకటించారు. కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు ట్వీట్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు చిన్న విరామం అన్నారు.

ఈ ప్రకటన చేసి వారం కూడా గడవక ముందే ఛార్మి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. తనపై, డైరెక్టర్ పూరిపై ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని చెప్పారు. ఇక లైగర్ మూవీతో అగాధంలోకి వెళ్ళిపోయిన పూరి-ఛార్మి ఎలా కమ్ బ్యాక్ అవుతారో చూడాలి. పూరికి నెక్స్ట్ ఎవరు అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. వరుస పరాజయాలతో సర్వం కోల్పోయిన పూరి, ఛార్మి 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. ఆ సినిమాతో వచ్చిన లాభాలతో మళ్ళీ అన్నీ తిరిగి పొందారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఫస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమాతో కోలుకున్న పూరి-ఛార్మి లైగర్ తో మళ్ళీ క్రిందకు జారారు.
Also Read:Ram Gopal Varma Climax: బూతు సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా వదిలిన వర్మ… ఎగబడి చూస్తున్న జనాలు