
డిజిటల్ స్ట్రీమింగ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోతుండటంతో, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి సంవత్సరాలలో రాని ఫాలోవర్స్ ఒక్క సంవత్సరంలోనే వచ్చేశారు. జనానికి వెబ్ థియేటర్లు బాగా కనెక్ట్ అయిపోయాయి. చక్కగా ఫోన్స్ లోనే కొత్త సినిమా చూసుకోవచ్చు. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రాశిఖన్నా, సమంత, కాజల్, తమన్న, అమలాపాల్, లాంటి టాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఓటిటి వేదికల పై అందాల ప్రదర్శనకు రెడీ అయిపోయారు. నిజానికి స్టార్ హీరోయిన్లు మొదట ఓటిటిలకి నో చెప్పినా, ఆ తరువాత సై అంటూ మొత్తానికి వరుసగా వెబ్ సిరీస్ లు చేసుకుంటూ పోతున్నారు.
Also Read: ప్రభాస్ కి డేట్స్ ఇవ్వని హాట్ బ్యూటీ !
కాగా ఎవరు ఏమి చేసున్నారో చూస్తే.. ముందుగా తమన్నా.. “11థ్ హౌర్” అనే తెలుగు వెబ్ ఫిలింలో నటించింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. షూటింగ్ పూర్తి అయింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అలాగే కాజల్ విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ నటించిన మొదటి వెబ్ సిరీస్….”లైవ్ టెలికాస్ట్”. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫిబ్రవరి 12న విడుదల అవ్వనుంది. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే.. శృతి హాసన్ మొదటి వెబ్ ఫిల్మ్ వచ్చేనెలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవ్వనుంది. “పిట్ట కథలు” పేరుతో నాలుగు కథలను కలిపి ఒక మూవీగా తీశారు. శృతి హీరోయిన్ ది ఒక కథ అన్నమాట.
Also Read: డైరెక్టర్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్ !
అలాగే అక్కినేని సమంత కూడా ఇప్పటికే “ది ఫ్యామిలీ మేన్ 2” వెబ్ సిరీస్ లో నటించింది. వచ్చే నెలలో ఇది అమెజాన్ లో ప్రసారం అవుతుంది. ఆమె ఇప్పటికే “అహా” కోసం టాక్ షో నిర్వహించింది. రాశి ఖన్నా కూడా హిందీలో ఒక వెబ్ డ్రామా అంగీకరించింది. షాహిద్ కపూర్ హీరో. రాజ్ డీకే తీస్తున్నారు. ఆమెకిదే ఫస్ట్ వెబ్ షో. సాయి పల్లవి తమిళంలో ఒక వెబ్ ఫిలింలో యాక్ట్ చేసింది. ఇషా రెబ్బ, ప్రియమణి, అంజలి… ఇలా చాలామంది హీరోయిన్లు డబ్బులు కోసం వెబ్ వైపు ఆసక్తిగా చూపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్