
సినిమాను శిల్పంలా చెక్కడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అంటారు. అలా చెక్కి తీర్చిదిద్దిన ‘బాహుబలి’ చిత్రాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. రాజమౌళిని దేశం గర్వించే దర్శకుడిగా తీర్చిదిద్దాయి. దక్షిణ భారతదేశంలోనే ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి మలిచిన దర్శకుడిగా రాజమౌళికి పేరు వచ్చింది.
శంకర్ తోపాటు రాజమౌళి కూడా దక్షిణాదిన గొప్ప దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. కమర్షియల్ చిత్రాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు. భారతీయ చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్ విప్లవాన్ని తీసుకొచ్చారు.
శంకర్ మాదిరిగానే రాజమౌళి కూడా తన ప్రతి సినిమాకు బడ్జెట్ ను భారీగా పెంచేస్తాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బడ్జెట్ ను 400 కోట్లకు పెంచేశాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ లో ఒక అద్బుతమైన విలాసవంతమైన పాట చిత్రీకరించేందుకు రాజమౌళి రెడీ అయ్యాడట.. ఈ పాట కోసం ఏకంగా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఖర్చు చేస్తున్నారట.. తెలుగులోనే అత్యంత ఖర్చయిన పాట ఇదే అవుతుందట.. ఈ పాటను వచ్చే నెలలో యూరప్ లో చిత్రీకరిస్తారట.. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్ పాల్గొంటారు. దానికోసం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
బాహుబలి సినిమాలో పాటల చిత్రీకరణ విషయంలో రాజమౌళికి ప్రశంసలు అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లోని ఈ చివరి పాటలో ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరీ.