Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టూ ఫినాలే రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా టాస్క్ లు నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ఈ నేపథ్యం లోనే గాలం వెయ్ అనే టాస్క్ లో అబ్బాయిలందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ ప్రియాంక ఆరోపించింది. అందులో మొదటి వాడివి నువ్వేనని ప్రశాంత్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఫినాలే రేస్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక అబ్బాయిలతో సమానంగా ఆడుతూ .. పొట్టి పిల్ల చాలా గట్టి పిల్లని నిరూపించుకుంది.
ఫినాలే రేస్ కొనసాగుతూ వచ్చింది. కాగా గత మంగళవారం ఎపిసోడ్ లో ఫినాలే రేస్ లో భాగంగా బిగ్ బాస్ గాలం వెయ్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ముందుగా అర్జున్ గాలం వేసి బాల్ లాక్కుని బాస్కెట్ లో పెట్టాడు. తర్వాత గాలం వేసి ప్రియాంక బాల్ బయటకు లాగింది. కానీ పక్కనే ఉన్న ప్రశాంత్ వెంటనే బాల్ ప్రియాంక చేతికి రాకుండా లాక్కెళ్లిపోయాడు. మూడో రౌండ్లో యావర్ బాల్ ను బయటకు లాగగా .. అమర్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
ఇద్దరి మధ్య తన్నులాట జరిగింది. ఇక ఎలా గొల యావర్ బాల్ బుట్టలో పెట్టేశాడు. ఇక చివరికి అమర్ .. ప్రియాంక మిగిలారు. ప్రియాంక గాలం వేసి బాల్ బయటకు లాగింది. అయితే అమర్ దీప్.. ప్రియాంక దగ్గర బాల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిసికల్ గా ఎటాక్ చేసి మరీ బాల్ లాక్కున్నాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయి.
ఇది పక్కన పెడితే.. హౌస్ లో ఉన్న అబ్బాయిలంతా కలిసి నన్ను మోసం చేశారు అని ప్రియాంక .. ప్రశాంత్ తో చెప్పింది. మీరందరు కావాలనే నాపై పడ్డారు అని అనడంతో .. ప్రశాంత్ నేనేం చేయలేదు అన్నాడు. అసలు మొదలు పెట్టింది నువ్వే అంటూ ప్రియాంక ఫీల్ అయింది. ఏంటి నేనా .. అని ప్రశాంత్ అనగా, అవును నువ్వే అది నీ మనసుకు తెలుసు, నీ గుండెకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.