Homeఎంటర్టైన్మెంట్NTR: 'ఆలియా భట్ - 'కియారా అద్వానీ'.. వీరిలో ఎన్టీఆర్ కి హీరోయిన్...

NTR: ‘ఆలియా భట్ – ‘కియారా అద్వానీ’.. వీరిలో ఎన్టీఆర్ కి హీరోయిన్ ఎవరు ?

NTR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’లో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా నటించారు. ఈ మూవీ ప్రమోషన్లతో ఆలియా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో ఎన్టీఆర్ 30వ చిత్రంలో ఆమెను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Jr NTR Rejected Movies
Jr NTR Rejected Movies

మరోవైపు ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. ఓ దశలో హీరోయిన్ ను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ, ఇలా అనేక రకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

Also Read:  మరో హీరోకి కరోనా పాజిటివ్.. ఎవర్నీ వదలను అంటున్న కరోనా !

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియాని ఖాయం చేశారని అంటున్నారు. ఆ మధ్య బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ‘కియారా అద్వానీ’తో మేకర్స్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అని అన్నారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో చూడాలి. ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడని తెలుస్తోంది.

అన్నట్టు ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నాడట. కాగా ఆ హాలీవుడ్ సినిమా కథలో తెలుగు నేటివిటీని మిక్స్ చేసి.. మంచి ఎమోషనల్ డ్రామాను కొరటాల రెడీ చేశాడని అంటున్నారు. పైగా పలనాటి ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read:  ధమాకా నుంచి అల్ట్రా-స్టైలిష్ లుక్ లో రవితేజ

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular