Rajamouli- Nagarjuna: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ని దక్కించుకొని టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు..60 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ కూడా నాగార్జున ఇప్పటికి యంగ్ కనిపించడం విశేషం..కేవలం అందం విషయం లో మాత్రమే కాదు..బాక్స్ ఆఫీస్ విషయం లో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఉన్నారు..రొటీన్ కి బిన్నంగా స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టి నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో బహుశా ఏ హీరో కూడా చేసి ఉండరు..అలా అద్భుతమైన ఫిల్మోగ్రఫీ ఉన్న నాగార్జున వందవ సినిమాకి చేరువలో ఉన్నాడు..ప్రతి హీరో మైల్ స్టోన్ స్టోన్ గా భావించే సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాము..అలాగే నాగార్జున కూడా తన వందవ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట..ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ హల్చల్ చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే నాగార్జున తన వందవ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..రాజమౌళి ని కలిసినప్పుడల్లా తనతో సినిమా ఎప్పుడు చేస్తావు అని అడిగేవాడినని..దానికి రాజమౌళి గారి దగ్గర నుండి చిరునవ్వు సమాధానం గా వచ్చేదని ఇటీవల ఘోస్ట్ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున తెలిపాడు..ఆయన హీరో గా నటించిన ఘోస్ట్ సినిమా వచ్చే నెల విజయ దశమి కానుకగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..తన వందవ సినిమాకి రాజమౌళి ని దర్శకత్వం వహించాల్సిందిగా కోరానని..రాజమౌళి గారు నాకు కాస్త సమయం ఇవ్వండి..కచ్చితంగా చేద్దాం అని చెప్పాడని ఈ సందర్భంగా నాగార్జున తెలిపాడు.

అభిమానులు గట్టిగా కోరుకుంటే మా కాంబినేషన్ లో సినిమా రావొచ్చు అని నాగార్జున గారు చెప్పుకొచ్చారు..గతం లో నాగార్జున హీరో గా నటించిన ‘రాజన్న’ సినిమాకి రాజమౌళి గారు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు..అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..కానీ వీళ్ళ కాంబినేషన్ లో పూర్తి స్థాయి సినిమా అయితే ఇప్పటి వరుకు రాలేదు..ఇప్పుడు నాగార్జున వందవ సినిమా రాజమౌళి తో ఉంటుంది అనే వార్త అధికారికంగా ఖరారు అయితే మాత్రం అక్కినేని ఫాన్స్ కి పండగే అని చెప్పాలి.