Akira Nandan
Akira Nandan : గత రెండు వారాల నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వైరల్ ఫీవర్ తో పాటు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ, డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మంగళగిరి లోని క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ఆయన వారం రోజుల సమయం పట్టింది. ఇంటి వద్దకే ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు చేసేవాడు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన అనారోగ్యం నుండి పూర్తి కోలుకోవడంతో దక్షిణ భారత దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల సందర్శన కోసం నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరాడు. అందులో భాగంగా నేడు ఆయన కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకొని, అటు నుండి రోడ్డు మార్గంలో కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకీరానందన్(Akira Nandan), స్నేహితుడు టీటీడీ బోర్డు మెంబెర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.
అకిరా నందన్ కి సంబంధించిన లుక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. కుర్ర వయస్సు లో పవన్ కళ్యాణ్ ఎలాంటి లుక్స్ లో అయితే ఉండేవాడో, అలాంటి లుక్స్ లో అకీరానందన్ కనిపించాడు. గుబురు గెడ్డం తో స్టైలిష్ గా ఉన్న అకిరా నందన్ ని చూసి, అభిమానులు ‘బాబు నువ్వు మీ నాన్న కి దూరం గా ఉండు..డామినేట్ చేసేస్తున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కటౌట్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే మొదటి సినిమాతోనే స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళిపోతాడని, ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడతాడని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అకిరా నందన్ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గురువు సత్యదేవ్ వద్ద యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ ఏడాది మొత్తం అక్కడ యాక్టింగ్ కోర్స్ పూర్తి అయ్యాక, 2026 వ సంవత్సరం లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదంతా పక్కన పెడితే అకిరా నందన్ కి మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తి మామూలుది కాదు. ఓజీ చిత్రానికి అకీరానందన్ కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. అంటే ఒకవేళ అకిరా నందన్ సినిమాల్లోకి వస్తే తన సినిమాలకు తానే సంగీతం అందించుకోబోతున్నాడు అన్నమాట. అభిమానులు ఇతని ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఉపముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతూనే, మధ్యలో ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu)’ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు వారాల క్రితం ఈ సినిమా నుండి విడుదలైన ‘మాట వినాలి’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న రెండవ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయనున్నారు.