Akhira Nandan OG Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక దాంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య కి భారీ లాభాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఓజీ సినిమా లాంగ్ రన్ లో మరింత భారీ కలెక్షన్స్ ని సంపాదించే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఈ సినిమా చివర్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక దాని తగ్గట్టుగానే డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా స్క్రిప్ట్ మీద కొన్ని కసరత్తులైతే చేసినట్టుగా తెలుస్తోంది. సెకండ్ పార్ట్ లో అఖిరా నందన్ మెయిన్ లీడ్ లో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జపాన్ లోని యాకుజ అంతరించిపోతున్న క్రమంలో ఆ తెగ నుంచి వచ్చిన ఓజస్ గంభీరా చాలా మంది రౌడీలను చంపేశాడు. ఇక అఖిరా నందన్ మాత్రం ఓజస్ గంభీరా శిష్యుడిగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
సమాజానికి హాని చేసే వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నాడు వాళ్ళని ఎలా అంతం చేశాడు అనే దానిమీద ఈ సినిమా స్టోరీ ఉండబోతుందట. మొత్తానికైతే అఖిరా నందన్ తన గురువు అయిన ఓజస్ గంభీరా ఏం చెప్పాడు. ఆయన దాని కోసం ఎలా పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా మెయిన్ కథగా తెలుస్తోంది…
మరి వీళ్ళిద్దరిని కలిపి స్క్రీన్ మీద చూపించగలిగితే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సుజీత్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు మరోసారి తన సత్తా ఏంటో చూస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం సుజీత్ నానితో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు.
దసర రోజు ఈ సినిమా ముహూర్తం జరిగింది. తొందరలోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…