Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ,ఐదవ వారంలో అడుగుపెట్టింది . రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది . బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనలను ,కంటెస్టెంట్స్ ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు మీమర్స్,వారికి ఇష్టమొచ్చినట్టు ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ సీజన్ -4 రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ వీటిపై స్పందించాడు . బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మాన్ గా అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తున్న అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తన పై నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో బుద్ధి చెప్పాడు. మీకు దమ్ముంటే హౌస్ లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా చూశాను అని చెప్పాడు. అయితే పవర్ అస్త్ర సాధించిన పల్లవి ప్రశాంత్ ని పొగుడుతూ ,వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావ్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే .
తాజాగా ప్రశాంత్ ని పొగుడుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. అఖిల్ తన పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అఖిల్ మాట్లాడుతూ నా పై ట్రోల్స్ చేస్తున్న అందరికీ చాలా థాంక్స్ . నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు . నా పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి స్పెషల్ థాంక్స్ ఇవన్నీ ఇప్పటికే చాలా చూసా. ఇలాంటివి అసలు పట్టించుకోను. ప్రశాంత్ విన్నర్ అయినా ,రన్నర్ గా నిలిచిన సంతోషిస్తా అన్నాడు.
కొత్తగా ఆలోచించి ,డిఫరెంట్ గా ట్రోల్ చేస్తే బాగుంటుంది . నన్ను రెండు సార్లు రన్నర్ అంటున్నారు ,మీకు దమ్ముంటే హౌస్ లోకి వెళ్లి టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్ లో గేమ్ క్లియర్ గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు . సీజన్-4 మళ్ళీ గుర్తు చేసినందుకు మరోసారి థాంక్స్ అంటూ పోస్ట్ చేసాడు . నెటిజన్స్ కూడా అఖిల్ ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు .