Akhil Akkineni and Pooja Hegde: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను (Most Eligible Bachelor) ఇప్పటికే పూర్తీ చేశాడు. అయితే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీకు మొత్తానికి మోక్షం లభించింది. అక్టోబర్ 8న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి.
అయితే, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రైట్ రిలీజ్ డేట్ కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ సినిమాకి స్ట్రైట్ రిలీజ్ డేట్ దొరికలేదు. అక్టోబర్ సెకండ్ వీక్ లో ఏకంగా నాలుగు సినిమాల వరకూ విడుదలవ్వనున్నాయి. అంటే ఆ సినిమాల పోటీలోనే బ్యాచలర్ రిలీజ్ అవుతున్నాడు.
మొత్తానికి మంచి అంచనాలు ఉన్న స్టార్స్ సినిమాలతో బ్యాచలర్ కు పోటీ పడితే.. బ్యాచలర్ నిలబడగలడా ? అనేది ఇప్పుడు పెద్ద అనుమానం. నిజానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మరి ఆ వార్తల్లో కొంత నిజం ఉన్నా ‘బ్యాచిలర్’ హిట్ కొట్టడం దాదాపు కష్టమే.
కాకపోతే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తోంది. కాబట్టి ఆమె కోసమైనా యూత్ సినిమా ఫస్ట్ షో కోసం ఎగబడొచ్చు. పైగా అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది అంటున్నారు. అన్నిటికి మించి వారి మధ్య లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి.
కానీ అఖిల్ కి మార్కెట్ లేదు. అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా బాక్సాఫీస్ వద్ద అఖిల్ మార్కెట్ రేంజ్ ను స్పష్టంగా తెలియ జేసింది. మరి చూడాలి బ్యాచిలర్ ఎంతవరకు నిలబడతాడో. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.