Akhil Akkineni: ‘అయ్యగారు’ అనే పదం గతంలో పల్లెటూరుల్లో బాగా వినిపించేది. అయితే అప్పట్లో హీరోలను కూడా అయ్యగారు అని సంబోధించేవాళ్ళు. కానీ కాల గమనంలో అయ్యగారు ప్లేస్ లో బాబు వచ్చి చేరింది. ఆ అయ్యగారు పాత పడిపోయింది. అయితే, ఇప్పుడు ఆ పదం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోకి నిక్ నేమ్ అయిపోయింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా ? అక్కినేని అఖిల్.

వెరీ స్టైలిష్ గా ఉండే అఖిల్ కి అలాంటి ఓల్డ్ నేమ్ ఎలా పెట్టారు అంటే.. అది ‘హలో’ సినిమా రిలీజ్ రోజు. సినిమా చూసి వచ్చిన ఓ అభిమాని ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సంతోషంగా ‘హేయ్.. మా కింగ్ కొడుకొచ్చాడు. మా అయ్యగారొచ్చారు… ఇక మా అయ్యగారే నెంబర్ వన్’ అంటూ తెగ హల్ చల్ చేశాడు. దాంతో ఆ అభిమాని కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆ అభిమాని చేసిన రచ్చ దెబ్బకు ఆ తరవాత కూడా.. అతను మీమ్స్ లో కూడా ఎక్కువగా కనిపించాడు. మొత్తానికి మీమ్స్ పుణ్యమా అని అయ్యగారు అనే పదం బాగా పాపులర్ అయింది. అందుకే, బొమ్మరిల్లు భాస్కర్ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో చివరి డైలాగ్ గా అయ్యగారు పదాన్నే ఒక డైలాగ్ గా రాసుకున్నాడు.
పైగా పూజా హెగ్డే ఒయ్యారంగా నడుస్తూ కసి చూపులతో ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అయ్యగారూ’ అని పలికింది. ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం గోలగోల చేశారు అభిమానులు. మొత్తానికి ఈ అయ్యగారు అనే పదం అఖిల్ కి మరింత దగ్గర అయింది. పైగా అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు అఖిల్ ఫ్యాన్ అనగానే గుర్తొచ్చేది ‘అయ్యగారు’ అని హడావుడి చేసిన అభిమానినే.
మొత్తమ్మీద తనకు ఒక ఫ్యాన్ ఉన్నాడు అని ఘనంగా చాటి చెప్పిన ఆ అభిమానిని అఖిల్ కలవాలని ఆశ పడుతున్నాడు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నన్ను అయ్యగారు అని పిలిచి.. మీమ్స్ లో అతను బాగా పాపులర్ అయ్యాడు. పైగా నెటిజన్లు కూడా నాకంటే తనని ఎక్కువ పాపులర్ చేశారు. అందుకే చివర్లో ఆ డైలాగ్ పెట్టడం జరిగింది. అందుకే నాకు అతన్ని కలవాలని వుంది. తప్పకుండా త్వరలోనే కలుస్తా’ అంటూ అఖిల్ తన ఫ్యాన్ గురించి కామెంట్స్ చేశాడు.