https://oktelugu.com/

Balakrishna Akhanda Movie: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

Balakrishna Akhanda Movie:  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై శనివారంతో 100రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ అఖండ విజయాన్ని పురస్కరించుకుని మార్చి 12న కర్నూలులో కృతజ్ఞత సభను నిర్వహించనుంది చిత్రబృందం. ఇక బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది ‘అఖండ’. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి. ఇక ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 10, 2022 / 10:49 AM IST
    Follow us on

    Balakrishna Akhanda Movie:  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై శనివారంతో 100రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ అఖండ విజయాన్ని పురస్కరించుకుని మార్చి 12న కర్నూలులో కృతజ్ఞత సభను నిర్వహించనుంది చిత్రబృందం. ఇక బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది ‘అఖండ’. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి.

    Akhanda

    ఇక ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. వాస్తవానికి అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని.. ఈ సినిమా నిర్మాత కూడా ఊహించలేదు.

    Also Read:  ఆర్​ఆర్​ఆర్​’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి

    కారణం, బాలయ్య గత చిత్రాలు జైసింహా, రూలర్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా వరుసగా అన్నీ సినిమాలలో ఏది పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అందుకే దిల్ రాజుకి ఈ సినిమా నైజాం రైట్స్ ను చాలా తక్కువ ధరకే అమ్మారు. మొత్తానికి దిల్ రాజుకు ఫుల్ లాభాలు వచ్చాయి.

    Akhanda

    అయితే ‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ కి వస్తే.. రూ. 73.29 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ. 19.29 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి. అన్నీ కలుపుకుని లెక్క వేసుకుంటే.. 110 కోట్లు వరకు ఈ సినిమాకు గిట్టుబాటు అయినట్టే.

    Also Read: వైరల్ : ‘రామ్ చరణ్’ బర్త్‌ డే సర్‌ ప్రైజ్ రెడీ

    Tags