Akhanda vs Khiladi: బాలయ్య హీరోయిజమ్ ముందు రవితేజ స్టార్ డమ్ పెద్దగా లెక్క లోకి రాదు. బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ దారుణంగా రావొచ్చు, కానీ బాలయ్య అంటే.. ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలయ్య సినిమా బాగుంది అంటే.. ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి. కాకపోతే.. బాలయ్య సినిమాకి బాగుంది అనే టాక్ రావడం గగనం అయిపోయింది. అందుకే, రవితేజ లెగిస్తే బాలయ్యతో పోటీ పడటానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

నిజానికి బాలకృష్ణ, రవితేజ సినిమాల మధ్య పోటీ ఎప్పటినుంచో ఉంది. గతంలోనూ వీరిద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. ఆ పోటీలో రవితేజ ఎక్కడా వెనక్కి తగ్గకుండా మొత్తానికి కొన్నిసార్లు ముందంజలో కూడా నిలిచాడు. అయితే, తాజాగా ఈ పోటీ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. రవితేజ తన ఖిలాడీ సినిమాని బాలయ్య అఖండ సినిమా పై రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
బాలయ్య తన సినిమా దీపావళి స్పెషల్ గా రాబోతుందని ఎనౌన్స్ చేశాడు. అయితే, ఇప్పుడు అదే దీపావళికి తాపీగా రవితేజ కూడా తన సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నాడు. అసలు నట సింహం బాలయ్య బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే… భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అఖండ టీజర్ కి కూడా విశేషమైన ఆదరణ లభించింది.
మరోపక్క రవితేజ ఖిలాడి పై ఎలాంటి అంచనాలు లేవు. పైగా ఆ సినిమా టీజర్ కూడా ప్లాప్ అయింది. మరి బాలయ్య సినిమా పై పోటీకి వస్తోన్న రవితేజ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. కాకపోతే ‘క్రాక్’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ‘ఖిలాడి’. పైగా రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. బాలయ్య కూడా అలాగే నటిస్తున్నాడు అనుకోండి.
కానీ, బాలయ్యకి డ్యూయల్ రోల్ అనేది కామన్, అదే రవితేజకు స్పెషల్. అందుకే, కాస్త రవితేజ సినిమాకి ఆ విషయంలో కొంచెం ఎక్కువ అటెంక్షన్ ఉంటుంది. కానీ, బాలయ్య ‘అఖండ’ని ఢీ కొట్టే సామర్థ్యం ‘ఖిలాడి’ ఎంతవరకు ఉంది అనేదే ఇక్కడ ప్రశ్న. కచ్చితంగా సినిమా అద్భుతంగా ఉంది అని ‘ఖిలాడి’కి టాక్ వస్తే తప్పితే.. ఆ సినిమా నిలబడదు.