Akhanda 2 Ticket Rates: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలుపెట్టారు. అక్కడ ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో నెల రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే, ఇప్పటి వరకు కనీసం రెండు లక్షల డాలర్లు కూడా రాలేదు. సీక్వెల్ హైప్ తో వస్తున్న సినిమాకు ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అయితే మంచి డిమాండ్ ఉంది. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన టికెట్ రేట్స్ జీవో ని ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
స్పెషల్ ప్రీమియర్ షోస్ / బెనిఫిట్ షోస్ తో కలిపి మొత్తం మీద రోజుకి 5 షోస్ ని ప్రదర్శించుకునేందుకు అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్ 600 రూపాయిలు అట. ఇక రెగ్యులర్ షోస్ కి ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్ పై సింగల్ స్క్రీన్స్ లో 75 రూపాయిలు అదనంగా పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ కి 100 రూపాయిల వరకు పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది. అంటే సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేట్స్ 222 రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ టికెట్ రేట్స్ 277 రూపాయిల వరకు ఉంటుంది. మొదటి రోజు నుండి 10 వ రోజు వరకు ఈ టికెట్ రేట్స్ కొనసాగుతాయి. తెలంగాణ కి సంబంధించిన టికెట్ రేట్స్ జీవో కూడా రేపటి లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన జీవో వచ్చేసింది కాబట్టి, నేటి రాత్రి నుండి , లేదా ఉదయం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే స్టార్ హీరోలకు ఇప్పటి వరకు ఈ రేంజ్ టికెట్ రేట్స్ రావడం మనం చూసాము, కానీ మొట్టమొదటిసారి ఒక సీనియర్ హీరో సినిమాకు ఈ రేంజ్ టికెట్ రేట్స్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది విశ్లేషకులు బాలయ్య కి అంత టికెట్ రేట్స్ పెట్టి ఎవరు థియేటర్స్ లో చూస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు కూడా పది రోజుల పాటు టికెట్ రేట్స్ ఉంచాల్సిన అవసరం లేదని, కేవలం వీకెండ్ వరకు ఉంచితే సరిపోతుందని నిర్మాతలను ట్యాగ్ చేసి అడుగుతున్నారు. కానీ మేకర్స్ టాక్ కి తగ్గట్టు టికెట్ రేట్స్ వీకెండ్ తర్వాత తగ్గించాలా లేదా పెంచాలా అనే నిర్ణయం తీసుకుంటారట.
#Akhanda2 AP Ticket Hike GO!
December 4th Night Paid-premieres ₹600
Day1-10
Singles ₹222.5 & Plexes ₹277!!Day11-(Standard)
Singles ₹147.5 & ₹177!! pic.twitter.com/gfRT9EhjNm— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 2, 2025