Akhanda 2 Premiere Shows Cancelled: ఈ ఏడాది జులై నెలలో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు ముందు ఎన్ని ఆర్ధిక సమస్యలను ఎదురుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీమియర్ షోస్ మొదటి ఆట పడేవరకు కూడా సినిమా విడుదల అవుతుంది అనే ఆశ అభిమానుల్లో లేదు. అంతటి పరిస్థితి ని నెలకొల్పింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఇక మీదట ఏ సినిమాకు కూడా రాదు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘అఖండ 2’ కి అదే పరిస్థితి ఎదురైంది. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రేపు విడుదల అవ్వబోయే ఈ సినిమాకు నేటి రాత్రి నుండి ప్రీమియర్ షోస్ వేయడానికి ప్లానింగ్ చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బుకింగ్స్ మొదలు పెట్టారు, తెలంగాణ లో కూడా ఇక బుకింగ్స్ ప్రారంభం అవుతాయి అని అనుకుంటున్న సమయం లో ప్రీమియర్ షోస్ ని రద్దు చేస్తున్నట్టు నిర్మాత నుండి వచ్చిన వార్త అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది.
కేవలం ప్రీమియర్ షోస్ మాత్రమే కాదు, సినిమా విడుదల కూడా అనుమానమే అని అంటున్నారు. కారణం ఆర్ధిక లావాదేవీలు అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే గతం లో 14 రీల్స్ సంస్థ EROS తో కలిసి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలను నిర్మించింది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. దీంతో ఒప్పందం ప్రకారం 14 రీల్స్ సంస్థ EROS కి దాదాపుగా 28 కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ 14 రీల్స్ సంస్థ ఇప్పటి వరకు చెల్లించలేదు. కేవలం EROS తోనే కాదు, IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో పాటు మరో మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలతో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి.
మొత్తం మీద 14 రీల్స్ సంస్థ 60 కోట్ల రూపాయిలు చెల్లిస్తే తప్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు రాత్రి లోపు ఈ సమస్య సర్దుకొని సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. స్వయంగా నందమూరి బాలకృష్ణ రంగం లోకి దిగితే తప్ప, ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నే అధికారం లో ఉంది కాబట్టి, బాలయ్య ప్రభుత్వం తరుపున సిఫార్సులు చేయించి, ఈ చిత్రాన్ని విడుదల చేయిస్తారా?, లేదంటే వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
#Akhanda2 : No Guarantee for Early morning shows Either!
Not EROS.
Producers have financial issues of the existing project’s commitments. There are 4 different stakeholders including IVY Entertainment and 3 other local names.
Hopefully everything can be sorted Tonight.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 4, 2025