Akhanda 2 OTT Rights: నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించడం విశేషం… ఇప్పటికే మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన కాంబినేషన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వీళ్ళు ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు… వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని ఒక ప్రముఖ సంస్థ 84 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత అఖండ 2 సినిమా ఆశించినట్టుగా రాలేదని యావరేజ్ అయ్యేవిధంగా కనిపిస్తోంది అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కు కూడా పెద్దగా ఆదరణ దక్కడం లేదు… మొత్తానికైతే ఈ సినిమా ఎంత వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఒక రకంగా ఓటీటీ సంస్థ బాలయ్య బాబు సినిమాని అన్ని కోట్లు పెట్టి కొనడం అనేది రిస్క్ అనే చెప్పాలి. ఆయన సినిమాలను దాదాపు అందరు థియేటర్లోనే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఒక వేళ సినిమా తేడా కొడితే మాత్రం ఓటీటీలో కూడా అతని సినిమాలకు ఆదరణ దక్కదనేది మనందరికి తెలిసిన విషయమే… మరి ఇలాంటి సందర్భంలో ఓటీటీ సంస్థ ఈ మూవీ కోసమని అన్ని కోట్లు పెట్టి రైట్స్ ని ఎందుకు కొనుగోలు చేసింది అనేది ఎవ్వవ్వ రికి అర్థం కావడం లేదు.
మొత్తానికైతే బోయపాటి అలాగే బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ ను బట్టే మొత్తం ఆ రేటు కు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సినిమా మిగతా సినిమాల మాదిరిగా ప్రేక్షకులను అలరిస్తుందా? బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు ఉన్న మార్కును మరోసారి సెట్ చేసి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…