Akhand 2 : నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న బాలయ్య (Balayya) ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో మంచి సక్సెస్ మీద ఉన్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో అఖండ 2 (Akhanda 2) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకోవాలని ప్రయత్నంలోబోయపాటి, బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది… అయితే బాలయ్య పైట్ల తోనే కాకుండా డాన్సులతో కూడా ఆకట్టుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక అఖండ 2 సినిమాలో యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వేవ్ స్టెప్స్ ని కూడా వేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. బాలయ్య ప్రతి సినిమాలో ఒక మాస్ సాంగ్ తో పాటు ప్రేక్షకులందరికీ నచ్చే డాన్స్ కి స్కోప్ ఉన్న సాంగ్ కూడా ఉంటుంది.
Also Read : ప్రశాంత్ నీల్ కి ఒక టాస్క్ ఇచ్చిన ఎన్టీఆర్..? ఇదంతా దాని కోసమేనా..?
దానివల్ల బాలయ్య సూపర్ స్టెప్స్ వేస్తూనే ఇటు ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉంటాడు. మరి అలాంటి బాలయ్య ఇక ఈ సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు. ఆయన సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు డాన్స్ కి కూడా మంచి స్కోప్ ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు.
ఆ రకంగా ఆయన డాన్సింగ్ స్కిల్స్ ని కూడా చూపిస్తూ ప్రేక్షకులందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఇక బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు రాబోతున్న నాలుగో సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? ఇప్పటి లాగా బాలయ్య కు ఒక మంచి మాస్ సినిమాగా నిలిచి పోతుందా లేదా అనేది కూడా తెలియాలి ఉంది… ఇక వీళ్ళ కాంబోలో సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్య అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేశారు…ఇక సినిమా కోసం వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…