లేడి ఓరియేంటేడ్ మూవీలో ఐశ్వర్య?

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో తండ్రి కలను నెరవెర్చే అమ్మాయిగా నటించి మెప్పింది. చాలా ఎమోషన్ తో కూడిన ఈ పాత్రను చక్కగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. తెలుగుతోపాటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించింది. విజయ్ భార్య అద్భుతంగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటన […]

Written By: Neelambaram, Updated On : May 9, 2020 7:28 pm
Follow us on


‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో తండ్రి కలను నెరవెర్చే అమ్మాయిగా నటించి మెప్పింది. చాలా ఎమోషన్ తో కూడిన ఈ పాత్రను చక్కగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. తెలుగుతోపాటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించింది. విజయ్ భార్య అద్భుతంగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఐశ్వర్య రాజేష్ ముందుకెళుతోంది.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఓ లేడి ఓరియంటేడ్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట. ‘తిట్టం ఇరండు’ అనే టైటిల్ పేరుతో యువ దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా లాక్డౌన్ ఎత్తివేశాక సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సతీష్‌ రఘునాథన్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. కేవలం నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఐశ్వర్య రాజేష్ మొగ్గుచూపుతోంది. ఇటీవల విజయ్ సరసన ‘వరల్డ్ ఫేమస్’లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది.