Homeఎంటర్టైన్మెంట్Aishwarya Rajesh: 'బట్టలు లేకుండా కనిపించాలని ఆ డైరెక్టర్ అడిగాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు...

Aishwarya Rajesh: ‘బట్టలు లేకుండా కనిపించాలని ఆ డైరెక్టర్ అడిగాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య రాజేష్!

Aishwarya Rajesh: అందంతో మాత్రమే కాదు, టాలెంట్ తో కూడా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలను సంపాదించొచ్చు అని నిరూపించిన హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). ప్రముఖ సీనియర్ హీరో రాజేష్ కుమార్తె గా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి స్వయంగా ఈమెకు మేనత్త. తమిళం లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చిన ఐశ్వర్య రాజేష్, అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంది. తెలుగు లో ఈమె ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘రిపబ్లిక్’ లో హీరోయిన్ గా చేసింది. నాని ‘టక్ జగదీశ్’ చిత్రం లో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, టాలీవుడ్ లో ఆమె కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో ఎదురైనా కొన్న సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను కెరీర్ ప్రారంభ దశలో ఒక సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్లాను. ఆ చిత్ర డైరెక్టర్ నన్ను సెక్సీ నైట్ డ్రెస్ లో కనిపించమని అన్నాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఆడిషన్స్ ఇవ్వకుండానే తిరిగి వచ్చేశాను. నా శరీరం కనిపించాలని అన్నాడు, ఆ సమయం లో నాకు చాలా కోపం వచ్చేసింది. నన్నే కాదు, ఇలా అతను గతం లో ఎంతమంది హీరోయిన్స్ ని అడిగి ఉంటాడో మీరే ఊహించుకోండి. నా సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.

ఐశ్వర్య రాజేష్ అందరి హీరోయిన్స్ లాగా హాట్ డ్రెస్ లో గ్లామర్ గా కనిపించగలదు, కానీ ఇప్పటి వరకు సినిమాల్లో అలాంటి పాత్రల్లో కనిపించలేదు. సంస్కార పక్షమైన దుస్తుల్లోనే కనిపించింది. ఇలాంటి వాళ్లకు కెరీర్ ఉండదని అందరూ అంటుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని, ఆ దిశగానే తన కెరీర్ ని సాగిస్తూ ముందుకెళ్తోంది. అవకాశాలు వస్తే వచ్చాయి, లేదంటే లేదు అనే స్వభావం గల అమ్మాయి. ఈ కాలం లో ఇండస్ట్రీ లో ఇలాంటి హీరోయిన్స్ దొరకడం చాలా అరుదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె రీసెంట్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version