Mahesh Babu scolds Sunil: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలన్నీ అతనికి భారీ పాపులారిటిని తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటి వరకు కేవలం తెలుగులోనే సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా విషయంలో మహేష్ బాబు చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి తను చేయబోయే సినిమాలన్నింటికంటే కూడా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొనప్పుడు ఒక నటుడు తనని ఇరిటేట్ చేశారట. దాంతో ఆయన తన మీద కొంతవరకు సీరియస్ అయ్యారట. ఇంతకీ ఆ నటుడు ఎవరు ఇది ఎప్పుడు జరిగింది. అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో సునీల్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సందర్భంలో ఆయన డైలాగులు సరిగ్గా చెప్పడం లేదట. మహేష్ బాబుని ఇరిటేట్ చేస్తుండటంతో ఎడారి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన ఎండ ఉందట. కాబట్టి అక్కడ మహేష్ బాబు సునీల్ మీద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు మహేష్ బాబు సునీల్ ను తొందరగా చెప్పవయ్యా అంటూ అతని మీద సీరియస్ అయ్యారట…
Also Read: చిరంజీవి రాముడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నాడా..?
నిజానికి అక్కడ సునీల్ తప్పేమీ లేదట. డైరెక్టర్ త్రివిక్రమ్ మొదట రాసుకున్న డైలాగులు వేరు ఆయన లొకేషన్ లో చెప్పిన డైలాగులు వేరు…ఎప్పటికప్పుడు తను డైలాగ్స్ మార్చడంతో సునీల్ కొంతవరకు తడబడ్డాడు. ఇక ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మహేష్ బాబు అలా అన్నాడట.
మొత్తానికైతే ఫైనల్ గా ఆ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు సునీల్ తో కలిసిపోయి ఇద్దరు చాలా ఈజ్ తో ఆ సీన్స్ లో నటించి తొందరగా ఆ షూటింగ్ కంప్లీట్ చేశారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటున్న క్రమంలో మహేష్ బాబు సైతం ఇప్పుడు ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…
