Homeఎంటర్టైన్మెంట్Un Stoppable with NBK: అన్ స్టాపబుల్ అప్పుడే స్టాప్ అయ్యిందా..!

Un Stoppable with NBK: అన్ స్టాపబుల్ అప్పుడే స్టాప్ అయ్యిందా..!

Un Stoppable with NBK: తెలుగు ఇండస్ట్రీ లో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా తన హవా నడిపిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. వెండితెరపైన విధ్వంసాలు సృష్టిస్తూ తన పేరు మీద ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు బాలయ్యబాబు. ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టడానికి ఓ టీటీ ప్లాట్ ఫారం లోకి వచ్చాడు.

NBK's Un Stoppable
Nandamuri BalaKrishna

ఎన్నో విభిన్న నటిస్తూ ప్రేక్షకులని అలరించాడు బాలయ్య. ఈ సుదీర్ఘ ప్రయాణం లో ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య… ఇటీవలే ఆహా సంస్థ నిర్వహిస్తున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే” అనే కార్యక్రమానికి హోస్ట్ గా పరిచయం అయ్యాడు. ఆరంభం ఎపిసోడ్ తోనే మంచి పేరు సంపాదించుకున్న ఈ షో రెందు వారాలకే ఆగిపోయింది. అయితే క్రమంలో తాజాగా ఆహా సంస్థలు అకస్మాత్తుగా ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో వివరించాడు.

కొద్ది కాలంపాటు నుండి ఫ్లాప్ లతో ఇబ్బందిపడుతున్న బాలయ్యబాబు… బోయపాటి శీను దర్శకతం లో చేస్తున్న చిత్రం అఖండ. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే బాలయ్య ఎన్నో సినిమాల ని లైన్ లో పెట్టుకున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, శ్రీవాస్ ల తో సినిమాలు చేయబోతున్నట్లు వినికిడి.

ఇప్పటికే రెండు ఎపిసోడ్లని పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే. మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు, లక్ష్మి మంచు, మంచు విష్ణు అతిధులు గా విచ్చేసారు. రెండో ఎపిసోడ్ కి నాచురల్ స్టార్ నాని వచ్చారు. అయితే ప్రతి శుక్రవారం ఎపిసోడ్ ని విడుదల చేసే లాగా ప్లాన్ చేసుకున్నారు షో నిర్వాహకులు. కానీ గతవారం నుండి మూడో ఎపిసోడ్ మాత్రం విడుదల కాలేదు. ఫలితంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న షో రెండు వారాలకే పరిమితమయ్యింది.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
RELATED ARTICLES

Most Popular