https://oktelugu.com/

Agent – Liger : ఏజెంట్-లైగర్ చిత్రాలను దెబ్బతీసిన బామ్మర్ది… ఎంత పని చేశావురా!

ఈ రెండు చిత్ర పరాజయాల వెనుక బామ్మర్ది ఉన్నాడనేది టాక్. ఎవరీ బామ్మర్ది అంటే... ఏజెంట్, లైగర్ చిత్రాల్లో ఓ పదం హైలెట్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : April 30, 2023 / 09:26 AM IST
    Follow us on

    Agent – Liger : భారీ హైప్ మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన చిత్రాలుగా ఏజెంట్, లైగర్ నిలిచాయి.  ఈ రెండు చిత్రాల మీద ఆడియన్స్ అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. ఫలితం మాత్రం ఘోరంగా వచ్చింది.  లైగర్ మూవీ విజయ్ దేవరకొండ లైఫ్ నే మార్చేస్తుందని అందరూ భావించారు. బాలీవుడ్ లో లైగర్ మూవీ మీద బజ్ ఏర్పడింది. లైగర్ విజయం సాధిస్తా విజయ్ దేవరకొండ టాప్ స్టార్స్ లిస్ట్ లోకి చేరేవాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ డబుల్ డిజాస్టర్ అయ్యింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన లైగర్ నెగిటివ్ టాక్ తో నెక్స్ట్ డే నుండి చతికల పడింది. 

    లైగర్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. బయ్యర్లు పూరి జగన్నాధ్ మీద తిరుగుబాటు చేశారు. తమ నష్టాలు పూడ్చాలని ధర్నాలకు దిగారు. పూరి మాత్రం రూపాయి కూడా చెల్లించలేదని టాక్. పైగా బ్లాక్ మెయిల్ చేస్తే, గొడవలు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ ఆడియో ఫైల్ విడుదల చేశారు. లైగర్ విషయంలో నానా రచ్చ జరిగింది. ఈడీ అధికారులు పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండలను విచారించారు. విజయ్ దేవరకొండకు పూరి జగన్నాధ్ పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే ప్రచారం కూడా జరిగింది. 
     
    ఇక ఏజెంట్ విషయానికి వస్తే ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. విడుదలకు ముందే నెగిటివ్  పబ్లిసిటీ జరిగింది. దీంతో బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. అనుకున్న సమయానికి రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. అనిల్ సుంకర, దర్శకుడు సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఏజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో కథ, కథనాలు లేవని  విరిచారు. అఖిల్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. 
     
    అయితే ఈ రెండు చిత్ర పరాజయాల వెనుక బామ్మర్ది ఉన్నాడనేది టాక్. ఎవరీ బామ్మర్ది అంటే… ఏజెంట్, లైగర్ చిత్రాల్లో ఓ పదం హైలెట్ చేశారు. అదే ‘సాలా. హిందీలో బామ్మర్దిని సాలా అంటారు. దీన్ని బూతు పదంగా కూడా వాడతారు. ఈ పదానికి ఓ మాస్ అప్పీల్ ఉంది. దర్శకుడు పూరి హీరో యాటిట్యూడ్ తెలియజేసేలా లైగర్: సాలా క్రాస్ బ్రీడ్ అంటూ టైటిల్ లోనే మెన్షన్ చేశాడు. ఇక లైగర్ లో వైల్డ్ సాలా అంటూ పాటలో ఈ పదం వాడారు. టాలీవుడ్ చిత్రాలకు సాలా కలిసి రాలేదు. ఏజెంట్, లైగర్ చిత్రాల్లో సాలా కామన్ పాయింట్ కాగా, ఆ చిత్రాలు ఫెయిల్యూర్  ఇది కూడా కారణం అంటున్నారు. అయితే ఇది జస్ట్ సిల్లీ సెంటిమెంట్. సినిమాలో విషయం లేక అవి ఫ్లాప్ అయ్యాయని కొందరి వాదన.