Site icon OkTelugu

Nagarjuna 100th Movie: నాగార్జున 100 వ సినిమా క్లైమాక్స్ ఇలా డిజైన్ చేశారేంటి..?

Nagarjuna 100th Movie

Nagarjuna 100th Movie

Nagarjuna 100th Movie: అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లో చేసిన సినిమాలతో అనుకున్న విజయాలను సాధించలేదు. పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతుంటే నాగార్జున మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆయన కుబేర, కూలీ లాంటి రెండు సినిమాల్లో నటించాడు. వీటిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు.

దానివల్ల నాగార్జున ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగే కెపాసిటి తనకు ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఇక వైవిధ్యమైన పాత్రలు కూడా చేసే అవకాశం తనకు దక్కుతుంది. ప్రస్తుతం ఆయన తన వందో సినిమా పూర్తయిన తర్వాత మిగతా సినిమాల గురించి ఆలోచిస్తారట.

ప్రస్తుతానికైతే ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి సీనియర్ హీరోలందరు తనదైన రీతిలో సత్తా చాటుకుంటుంటే నాగార్జున ఒక్కడే వెనుకబడిపోయాడు… నాగార్జున 100 వ సినిమాలో క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.

నాగార్జున ఏడిపించే క్లైమాక్స్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు నాగార్జున అంత ఎమోషనల్ క్లైమాక్స్ అయితే మనకు ఇవ్వలేదని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి నాగార్జున చివర్లో చనిపోతాడా లేదంటే సినిమాకు సంబంధించి ఏదైనా త్యాగం చేసే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి… సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version