Movie Artist Association: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికల కన్నా ఎక్కువ హడావిడి జరిగిందనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించి ప్రమాణస్వీకారం కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే కొందరు మా అసోసియేషన్ కి ఎప్పుడు వెళ్లిన ఆఫీస్‌కి లాక్ చేసే ఉంటుంది అంటున్నారు. దీనిపై విష్ణు స్పందిస్తూ “మా” సభ్యులకు అందుబాటు లోనే వున్నాము అని అంటున్నారు. ఇక ఈ నెల 28న జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మీటింగ్ లో సిబ్బందిని మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు మంచు విష్ణు. మా సభ్యులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పర్ ఫెక్ట ప్లాన్ తోనే ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు.

మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులు పూర్తవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఇందులో భాగంగా మాలో మహిళ సాధికారత ఫిర్యాదులు విభాగం ఏర్పాటు రీసెంట్ గా చేశామన్నారు. అలానే మా సభ్యుల కోసం ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా హెల్త్ చెకప్… 50 శాతం రాయితీతో ఓపీ కన్సల్టేషన్ కల్పిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది అపోలో, సన్ షైన్, ఏఐజీ, కిమ్స్, మెడికవర్ ఆసుపత్రుల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. 100 రోజులలో మాలో మార్పు తీసుకొస్తాం అంటూ వెల్లడించారు విష్ణు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రత్యర్థి వర్గం పానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మళ్ళీ ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.