
Pawan Kalyan -RGV : సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబ్ పేల్చారు. సమాజంలో జరిగే పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించే ఆయన తాజాగా జనసేన ఆవిర్భావ సభపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా చేసిన ఓ మెసేజ్ ఇప్పుుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈనెల 14న నిర్వహించిన ‘పవన్ ఆవిర్భావ సభను చూసి చంద్రబాబు, లోకేశ్ కు గుండెపోటు రావడం ఖాయం అని.. కావాలంటే చెక్ చేసుకోండి’ అంటూ మెసేజ్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది. పవన్ సభకు జననీరాజనం పలికారని, కానీ లోకేశ్ పాదయాత్రకు జనమే రావడం లేదన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారని కొందరు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయనపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన 14న ఆవిర్భావ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు పవన్ కల్యాణ్ గుడివాడ నుంచి మచిలీపట్నంకు వారాహి పై బయలు దేరారు. సాధారణంగా ఇక్కడి నుంచి మచిలిపట్నం వెళ్తే కనీసం గంటన్నర సమయం పడుతుంది. కానీ 5 గంటలకు పైగా టైం తీసుకోవడంతో రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు రోడ్ల నిండా ద్విచక్రవాహనాలు, కార్లతో పవన్ ర్యాలీ సాగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాయి.
దీంతో పవన్ సభకు వచ్చిన జనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ టీడీపీ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సభ చూశాక చంద్రబాబు,లోకేశ్ కు గుండెపోటు రావడం ఖాయం అని తన ఇన్ స్ట్రాగ్రాం వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టు వైరల్ గా మారింది. చంద్రబాబు అంటే ఆర్జీవికి ఎప్పటి నుంచో కోపం. లక్మీఎన్టీఆర్ అనే సినిమా ద్వారా తన కోపాన్ని బయటపెట్టారు. అటు పవన్ పై కూడా చాలా సార్లు విమర్శలు చేశారు. కానీ ఈసారి పవన్ ను మెచ్చుకోవడం చూసి జనసైనికులు షాక్ అవుతున్నారు.
అయితే పవన్ సభకు వచ్చిన జనాన్ని చూసి ఎవరైనా అలా అనాల్సిందేనని జనసైనికులు సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోస్టును షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఆర్జీవిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో చిచ్చు పెట్టడానికి ఆర్జీవి ఇలాంటి కామెంట్లు చేయడం కామన్ అని.. ఆయన వ్యాఖ్యలు పట్టించుకోమని అంటున్నారు.