https://oktelugu.com/

Mega Star: తెలుగులో మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ను సంపాదించుకునే సత్తా ఉన్న హీరో ఎవరంటే..?

అప్పట్లో చిరంజీవి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో పండగ వాతావరణం నెలకొనేది. కొందరైతే ఆరోజు పనులకు వెళ్లకుండా సినిమా చూడడానికి థియేటర్లకి వచ్చేవారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 13, 2024 / 09:56 AM IST

    Mega Star Chiranjeevi

    Follow us on

    Mega Star: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాల పాటు మకుటం లేని మహారాజుగా గుర్తింపు పొందిన ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)…ఈయన చేసిన పాత్రల వల్లే ఈయనకు జనాల్లో విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఇక కమర్షియల్ సినిమాని చేయాలంటే అది చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేంత లా ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు.

    ఇక ఇలాంటి నేపథ్యంలోనే అప్పట్లో చిరంజీవి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో పండగ వాతావరణం నెలకొనేది. కొందరైతే ఆరోజు పనులకు వెళ్లకుండా సినిమా చూడడానికి థియేటర్లకి వచ్చేవారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి స్టార్ హోదాని అనుభవించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సీనియర్ హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నాడు. ఇక ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు.

    ఇక ఇది ఇలా ఉంటే స్టార్ హీరోలందరిలో ప్రస్తుతం చిరంజీవి సీట్ ని కైవసం చేసుకునే హీరో ఎవరు అనే దానిమీద పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే నెంబర్ వన్ ప్లేస్ కోసం మన స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ,ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు… అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక సినిమాతో ఒక హీరో స్టార్ డమ్ ను సంపాదిస్తే, మరొక సినిమాతో ఇంకొక హీరో స్టార్ట్ డమ్ ను తెచ్చుకుంటున్నాడు.

    కాబట్టి ఎవరి కంటే ఎవరు గొప్ప అనే విషయాల మీద క్లారిటీ అయితే రావడం లేదు. ఇక దాని వల్లే చిరంజీవి తర్వాత ఆయన ప్లేస్ ని ఆక్యుపై చేసే హీరో ఎవరు అనే దాని మీద ఏ ఒక్కరు సరైన సమాధానం చెప్పడం లేదు. ఇక మరికొద్ది రోజులు గడిస్తే గాని ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు అంటూ సినీ ప్రముఖులు సైతం ఈ విషయం మీద స్పందిస్తున్నారు…